twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    500 ఎంపీలకు వర్మ సిడీలు

    By Staff
    |

    Ram Gopal Varma
    రామ్ గోపాల్ వర్మ రణ్ వివాదం మరింత రాజుకుంటోంది. తాజాగా సుప్రీం కోర్టు సైతం అక్షింతలు వేసినా ఆయన తన మొండి పట్టుదలను వదిలేటట్లు కనపడటం లేదు. తాము రీమిక్స్ చేసిన జణగణమన పాట సీడిలను 500 మంది ఎంపీలకు పంపుతున్నారు. ఈ భాద్యతను నిర్మాత ముధు మంతెన భుజాన వేసుకున్నారు. ఈ విషయమై మంతెన మాట్లాడుతూ..దేశాన్ని ఎవరైతే పరిపాలిస్తున్నారో వారికి సీడిలు పంపి న్యాయాన్ని వారి ముంగిట పెట్టాం. అలాగే ఈ విషయంలో న్యాయస్ధానాన్ని కించిపరిచినట్లు మేం భావించటం లేదు. ఎవరికీ ఈ విషయంలో తప్పుడు సంకేతాలు అందకూడదనే మా ఆలోచన అన్నారు.

    అలాగే వర్మ ఈ విషయమై..అవును నేను పబ్లిసిటీ వస్తుందనే ఆ ప్రయత్నం చేసానంటూ ఒప్పుకుంటున్నారు. ఆయన తన తాజా చిత్రం 'రణ్'లో టైటిల్ ట్రాక్ కోసం జాతీయ గీతమైన 'జన గణ మన అధినాయక జయహే' గీతాన్ని 'జన గణ మన రణ్ హై' అంటూ రీమిక్స్ చేసి పాడించడంపై సెన్సార్ బోర్డు శనివారం నాడు అభ్యంతరం తెలిపింది. దీనిని ఎంతమాత్రం అనుమతించేది లేదని సెన్సార్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సిబిఎఫ్సి) తేల్చిచెప్పింది. దాంతో ఆయన మీడియా సమావేశంలో తాను ఎవరినీ విమర్శించటానికి, దేన్నీ అవమానించటానికి ఆ నిర్ణంయం తీసుకోలేదని కేవలం చిత్రానికి ప్రచారం కల్పించటానికే అనంటున్నాడు.

    ఇక తాజాగా రణ్ సినిమాలో జాతీయ గీతం వక్రీకరణపై సుప్రీంకోర్టు దర్శకుడు రామ్ గోపాల వర్మకు మొట్టికాయలు వేసింది. జాతీయ గీతంతో ఆటలొద్దని సలహా ఇచ్చింది. రామ్ గోపాల్ వర్మ వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. జాతీయ గీతాన్ని తొలగించాలనే సెన్సార్ బోర్టు నిర్ణయంపై సినిమాటోగ్రఫీ చట్టం కింద ఏర్పాటైన ట్రిబ్యునల్ కు వెళ్లాలని సుప్రీంకోర్టు రామ్ గోపాల వర్మకు సూచించింది.

    అయితే వర్మ న్యూఢిల్లీలో జరిగిన 'రణ్' తొలి ప్రమోలో జాతీయ గీతాన్ని రీమిక్స్ చేయడాన్ని సమర్ధించుకున్నారు. లిరిక్స్ ద్వారా తన భావాలను వ్యక్తపరచే ప్రయత్నం చేశాననీ, జాతీయగీతాన్ని ఏమాత్రం కించ పరచలేదనీ ఆయన తెలిపారు. భారత చలనచిత్ర పరిశ్రమలో తనకున్న 15 ఏళ్ల అనుభవాన్ని రంగరించి ఈ చిత్రాన్ని తెరకెక్కించాననీ, మీడియా వ్యాపారంలోని సైకలాజికల్ కోణాన్ని ఈ చిత్రం ఆవిష్కరిస్తుందనీ తెలిపారు.

    అమితాబ్ బచ్చన్ లీడ్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో పరేష్ రావల్, రజత్ కపూర్, రితీష్ దేష్ ముఖ్, మనీషా కొయిరాలా, పూరబ్ కోహ్లి తదితరులు నటించారు. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X