»   » అశ్లీల సైట్లు మంచివే... నిషేదంపై వర్మ మండిపాటు!

అశ్లీల సైట్లు మంచివే... నిషేదంపై వర్మ మండిపాటు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అశ్లీల వెబ్ సైట్లపై ప్రభుత్వం నిషేదం విధించే అంశంపై తనదైన రీతిలో స్పందించారు. ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసారు. తాలిబాన్, ఐఎస్ఐఎస్ లాంటి తీవ్రవాద సంస్థలు స్వేఛ్చను ఎలా హరిస్తున్నాయో మన ప్రభుత్వాలు కూడా అదే రీతిలో వ్యవహరిస్తున్నాయని మండి పడ్డారు.

RGV sensational comments on Government

వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛను ప్రభుత్వం హరిస్తే అది ఆదేశ సామాజిక స్థితిని ప్రభావం చూపుతుందని, అశ్లీల చిత్రాలు లైంగిక నేరాలను పెంచవని, లైంగిక నేరాలను నిరోధించడానికి అశ్లీల సైట్లను నిషేధించడమే శాశ్వత పరిష్కారం కాదన్నారు. లైంగిక కోరికల నిగ్రహానికి అశ్లీల సైట్లు ఒక సురక్షిత మార్గమని పలు అంతర్జాతీయ సర్వేలు నిరూపించాయని వర్మ ట్వీట్‌ చేశారు.

పోర్న్‌ సైట్లపై నిషేధం విధించడం కన్నా, అశ్లీల సైట్లను తప్పుడు మార్గంలో వెళ్లకుండా చూడాలని, ఇత‌ర ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను వెతుక్కోవాలన్నారు. ప్రభుత్వం తీరు మారకపోతే ఎన్నికల్లో ప్రభుత్వం తుడిచిపెట్టుకుపోతుందని వర్మ వ్యాఖానించారు. వర్మ ట్వీట్లపై విమర్శల వర్షం వెల్లువెత్తుతోంది.

English summary
"Considering the sheer popularity of Porn whichever government owns up to banning it is sure to be wiped out of existence in next election. Government should work on finding ways to steer the content not to go in wrong directions rather than to block it." RGV tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu