twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాలాంటి స్వార్థపరుడు వాటికి అవసరం లేదు.. రాజమౌళి చాలెంజ్‌కి దండం పెట్టేసిన ఆర్జీవీ

    |

    రామ్ గోపాల్ వర్మతో వ్యవహారం అంత ఈజీగా ఉండదు. ఎవ్వరూ ఊహించని రీతిలో స్పందించడం, ఎవ్వరూ చేయని విధంగా చేయడం వర్మ స్టైల్. అందరి హీరోల్లో చాలెంజ్‌లు విసురుకోవడం, ఫోటోలు దిగి హల్చల్ చేయడం వర్మ స్ట్రాటజీ కానే కాదు. అలా మొన్న రామ్ చరణ్ గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను స్వీకరించాడు. మూడో దశ గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను అప్పుడెప్పుడో ప్రభాస్ ప్రారంభించి రామ్ చరణ్‌కు సవాల్ విసిరితే ఈ మధ్య పూర్తి చేశాడు. అలా రామ్ చరణ్ విసిరిన చాలెంజ్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

    వారిపై తదుపరి బాధ్యత..

    వారిపై తదుపరి బాధ్యత..

    రామ్ చరణ్ గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను స్వీకరిస్తూ మొక్కలు నాటాడు. ఆ తరువాత అలియా భట్, రాజమౌళి, ఆర్ఆర్ఆర్ టీంకు చాలెంజ్‌ను విసిరాడు. నేడు మొత్తానికి ఆర్ఆర్ఆర్ టీం అందరూ మొక్కలు నాటారు. అందులో రాజమౌళి కూడా తన వంతు బాధ్యతను నిర్వర్తించాడు. రాజమౌళి తన బాధ్యతగా ముగ్గురిని నామినేట్ చేశాడు.

     ఆ ముగ్గురు దర్శకులకు..

    ఆ ముగ్గురు దర్శకులకు..


    రాజమౌళి తన వంతుగా మొక్కలు నాటి రామ్ గోపాల్ వర్మ, వివి వినాయక్, పూరి జగన్నాథ్‌లకు చాలెంజ్‌ను విసిరాడు. ఈ ముగ్గురిలో ఇద్దరు మాత్రం చాలెంజ్‌ను స్వీకరించేలానే ఉన్నారని అందరూ భావించారు. అయితే రామ్ గోపాల్ వర్మ ఎలా స్పందిస్తాడా? అని అందరూ ఎదురుచూడసాగారు. నెటిజన్లు భావించినట్టే వర్మ వెరైటీగా స్పందించాడు.

    నాకు ఇష్టం ఉండదు..

    నాకు ఇష్టం ఉండదు..

    రాజమౌళి విసిరిన చాలెంజ్‌పై వర్మ స్పందిస్తూ.. నేను గ్రీన్ గానీ చాలెంజ్‌లకు గానీ చెందిన వాడిని కాదు.. నాకు మట్టి అంటే అసహ్యం.. ద్వేషం.. మొక్కలకు మంచి వ్యక్తులు కావాలి గానీ నా లాంటి స్వార్థపరుడు కాదు. మీకు మీ మొక్కలకు మంచి జరగాలి అంటూ దండం పెట్టేశాడు. మంచిగా స్పందిస్తే వర్మ ఎలా అవుతాడని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

    ఆర్ఆర్ఆర్ టీం..

    ఆర్ఆర్ఆర్ టీం..

    ఆర్ఆర్ఆర్ టీం మొక్కలు నాటి రామ్ చరణ్ ఇచ్చిన చాలెంజ్‌ను పూర్తి చేసింది. తదుపరి బాధ్యతను ఆర్ఆర్ఆర్ టీం ఆచార్య, పుష్ప, రాధేశ్యామ్ చిత్రయూనిట్‌లకు అప్పగించింది. మరి వీరు ఎప్పుడు చాలెంజ్‌లను పూర్తి చేస్తారో చూడాలి. మొత్తానికి మళ్లీ గ్రీన్ ఇండియా చాలెంజ్ వైరల్ అవుతోంది.

    English summary
    RGV Sensational Reply To Rajamouli Green India Challenge, I am neither into green nor into challenges and I hate touching mud ..The plants deserve a much better person and not a selfish B like me ..Wish u and ur plants all the best
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X