బాలయ్యపై ఆర్జీవీ సంచలన ట్వీట్.. ఇంట్లో జరిగిన కుటుంబ కుట్రలు!

Recommended Video

RGV Sensational Tweet On Balakrishna | Filmibeat Telugu

ఎప్పుడూ వివాదాలతో వార్తల్లో నిలిచే ఆర్జీవీ మరోమారు నందమూరి బాలకృష్ణపై తన పంజా విసిరాడు. ఎన్టీఆర్ బయోపిక్ ని టార్గెట్ చేస్తూ గత కొన్ని రోజులుగా రాంగోపాల్ వర్మ కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ బయోపిక్ కు పోటీగా వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని ప్రకటించాడు. లక్ష్మి పార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించిన తరువాత జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం ఉంటుందని వర్మ ప్రకటించాడు. ఈ చిత్రంపై సినీ రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. తాజాగా వర్మ షేర్ చేసిన వీడియో వైరల్గా మారుతోంది.

తికమక పెట్టే విధంగా

తికమక పెట్టే విధంగా

బాలయ్య, వర్మ వాయిస్ ఓవర్ లో ఏ వీడియో ఉంది. ఈ వీడియో గురించి తికమక పెట్టె విధంగా ఆర్జీవీ తనదైన శైలిలో ట్వీట్ చేశాడు. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం గురించి బాలయ్య ఆర్జీవికి వార్నింగ్ ఇస్తున్నట్లు ఈ వీడియోలో ఉంది. బాలయ్య వార్నింగ్ కు వర్మ వివరణ ఇస్తున్నాడు. ఎన్టీఆర్ బయోపిక్ లో లేనిది ఏమిటో, తన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో లేనిది ఏమిటో ఆర్జీవీ వివరించాడు.

ఏముందిరా నీ దగ్గర

ఒరేయ్ ఆర్జీవీ.. నాదగ్గర నేనున్నాను, విద్యాబాలన్ ఉంది, కళ్యాణ్ రామ్ ఉన్నాడు, రానా దగ్గుబాటి, నిత్యామీనన్, హన్సిక, పాయల్ రాజ్ పుత్, రకుల్ ప్రీత్ సింగ్, షాలిని పాండే, ప్రకాష్ రాజ్ వీళ్లంతా ఉన్నారు. మరి నీ సినిమాలో ఏముందిరా అంటూ వీడియోలో బాలయ్య వాయిస్ లో వార్నింగ్ ఉంది. సార్.. నాదగ్గర నిజం ఉంది.. నిజానికి మించిన సత్యం ఉంది. సత్యాన్ని తలదన్నే యదార్థం ఉంది. అది హైదరాబాద్ లోని వైస్రాయ్ హోటల్ ఘటన కావచ్చు, ఇంట్లో జరిగిన కుటుంబ కుట్రలు కావచ్చు అంటూ వర్మ వాయిస్ ఓవర్ వినిపిస్తోంది.

మీ ఇంటి అల్లుడికి తెలుసు సార్

మీ ఇంటి అల్లుడికి తెలుసు సార్

సార్ నిజం నాకన్నా ఎక్కువగా మీకు, మీ ఫ్యామిలీకి, మీ ఇంటి అల్లుడికి తెలుసు సార్. కానీ మీరు చెప్పరు. కాబట్టే నేను చెప్పాల్సి వస్తోంది. మీ సినిమాలో స్టార్స్ నటిస్తున్నారు. నిజమే.. కానీ ఎవరికీ అద్దాలు నిజాలు తెలియవు. కానీ నా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో నటిస్తున్న ప్రతి ఒక్కరికి నిజాలు ఏంటో తెలుసు అంటూ ఈ వీడియో లో ఉంది.

లోతుగా అధ్యయనం

లోతుగా అధ్యయనం

ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మి పార్వతి లాంటి సాధారణ మహిళ ఎలా ప్రవేశించింది అనే ఆసక్తికర అంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు వర్మ తెలిపారు. ఈ అంశంపై లోతుగా అధ్యయనం చేసి కథ సిద్ధం చేశానని వర్మ తెలిపాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విషయంలో వర్మ ఎలాంటి వివాదాలు, సంచలనాలు సృష్టిస్తాడో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X