రామ్ గోపాల్ వర్మ డాన్స్ చేస్తే ఇలా ఉంటుంది..(ఫోటోలు)
ముంబై : ఎప్పుడు సీరియస్‌గా ఫేసు పెట్టుకుని అదో రకంగా కనిపిస్తారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆయన ఫేసులో నవ్వు చూడటం చాలా అరుదు. ఆయన మాటలు కూడా ఆయన ఫేస్ ఫీలింగ్ లాగే కాస్త మొరటుగానే ఉంటాయి. మరి అలాంటి రామ్ గోపాల్ వర్మ...డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది? సరదాగా గడిపితే ఎలా ఉంటుంది? క్రింది స్లైడ్ షోలో అందుకు సంబంధించిన ఫోటోలు చూడొచ్చు.
బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సబినా ఖాన్ పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన బర్త్ డే పార్టీకి రామ్ గోపాల్ వర్మ హాజరయ్యారు. తన దర్శకత్వంలో వచ్చిన సత్య సినిమాలోని ఓ పాటకు స్వయంగా స్టెప్పులేసిన అందరినీ ఆశ్చర్య పరిచారు. రామూజీ తొలిసారిగా డాన్స్ చేస్తుండటంతో అంతా ఆసక్తిగా తిలకించారు.
రామ్ గోపాల్ వర్మ సినిమాల విషయానికొస్తే...ప్రస్తుతం ఆయన తన గత సూపర్ హిట్ సత్యకు సీక్వెల్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో శర్వానంద్, అనైక జంటగా నటిస్తున్నారు. 1998లో వచ్చిన 'సత్య' అప్పటి పరిస్థితుల ఆధారంగా రూపొందించాం. అప్పటికి ఇప్పటికీ సమాజంలో చాలా మార్పు వచ్చింది. ఇప్పటి పరిస్థితుల ఆధారంగా ఈచిత్రం తెరకెక్కించాం. క్రైమ్ చేసే వ్యక్తి సైకాలజీ స్టడీ చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ధీరూబాయ్ అంబానీ లాంటి వ్యక్తి కార్పొరేట్ సంస్థల వైపు కాకుండా, అండర్ వరల్డ్ వైపు వెళ్లి ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందనేది ఈ సినిమాలో చూపిస్తున్నాం' అన్నారు.

కొరియోగ్రాఫర్ సబీనా ఖాన్‌తో స్టెప్పులేస్తున్న వర్మ

వర్మ డాన్స్ చూసి అంతా ఆశ్యర్య పోయారు.

ఎప్పుడూ సీరియస్ గా ఉండే వర్మ సరదాగా స్టెప్పులేయడంతో అంతా ఆసక్తిగా తిలకించారు.

రామూజీ.....వాటె యాంగిల్

డాన్స్ బాగా చేసానా.....? రామూజీ ఎక్స్ ప్రెషన్ అలానే ఉంది

తనతో స్టెప్పులేయించిన సబీనా ఖాన్‌తో వర్మ ఇలా సరదాగా...

సబీనా ఖాన్ తో స్టెప్పులేస్తున్న వర్మ కొత్త హీరోయిన్ అనైక


Click it and Unblock the Notifications











