»   »  ఛార్మీ వెనుక భాగం గురించి వర్మ సెక్సీ టాక్

ఛార్మీ వెనుక భాగం గురించి వర్మ సెక్సీ టాక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రామ్ గోపాల్ వర్మ...ట్విట్టర్ ని వేదికగా చేసుకుని తన సినిమాలపై తన సన్నిహితుల చిత్రాలపై కామెంట్స్ చేస్తూండటం సహజమే. చిత్రాల ప్రమోషన్ కోసం వాటిని ఆయన చేసినా ...కాంట్రావర్శితో కూడిన ఆ ట్వీట్స్ అందరినీ ఆకట్టుకుని సినిమాపై ఫోకస్ పెట్టేలా చేస్తూంటాయి. తాజాగా ఆయన ఛార్మి నడుమ మడతలు, వెనుక భాగం గురించి ట్వీట్ చేసి అందరినీ సినిమా వైపు తిరిగేలా చేసారు. ఆయన ఏమన్నారో ...ట్వీట్ లో చదివేతే బాగుంటుంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

జ్యోతి లక్ష్మీ.. ఈ అందానికి దాసోహమవ్వనివాళ్లు లేరు. కాంట్రాక్టరు నుంచి మినిస్టరు వరకూ అందరూ జ్యోతిలక్ష్మి అభిమానులే. ఆమె కొంటె చూపుకు, నడుం ఒంపుకు పడిపోయినవాళ్లే. 'జ్యోతిలక్ష్మి టచ్‌ మీ..' అంటూ ఆమె వెనుక క్యూ కట్టని మగాడు లేడు. అసలింతకీ ఈ జ్యోతిలక్ష్మి ఎవరు? ఆమె కథేంటి? తెలుసుకోవాలంటే 'జ్యోతిలక్ష్మీ' సినిమా చూడాల్సిందే. ఛార్మి ప్రధాన పాత్ర పోషించిన చిత్రమిది.

RGV sexy tweet on Jyothi Laxmi back

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న లేడీ ఓరియంటెడ్ సినిమా ‘జ్యోతిలక్ష్మి'. ఈ చిత్రంలో ఛార్మి టైటిల్ పాత్రలో పోషిస్తోంది. అయితే ఈ సినిమాలో ఛార్మి సెక్స్ వర్కర్‌గా కనిపించనుందని సమాచారం. ఓ సెక్స్ వర్కర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం జ్యోతిలక్ష్మి.

మల్లాది వెంకట కృష్ణ మూర్తి గారి 'మిసెస్ పరాంకుశం' అనే నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ నవలలో మిసెస్ పరాంకుశం అనే ఓ సెక్స్ వర్కర్ పెళ్లి చేసుకొని తన జీవితాన్ని ఎలా గడుపుతుందనే అంశం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అదే కథను కొన్ని మార్పులతో 'జ్యోతిలక్ష్మి'గా తెరకెక్కిస్తున్నారట. మరి పూరి, ఛార్మిని ఏరకంగా చూపిస్తారో వేచి చూడాలి.

పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ.... ''ఎప్పుడో పాతికేళ్ల క్రితం మల్లాది వెంకటకృష్ణమూర్తి రాసిన నవల ఇది. చాలా ఇష్టంగా తీసిన సినిమా ఇది. చిత్రీకరణ పూర్తయింది. జూన్‌లో విడుదల చేస్తాము. రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి ఈ కథ రాసినప్పుడు నేను పుట్టాను. అది వచ్చిన పాతికేళ్ళకు ఈ అమ్మాయి (చార్మి) పుట్టింది. ఇన్నేళ్ళుగా ఈ కథ ఈమె కోసమే ఆగి ఉందేమో'' అని వ్యాఖ్యానించారు

నిర్మాత సి.కల్యాణ్‌ మాట్లాడుతూ.... '''జ్యోతిలక్ష్మీ' విడుదలయ్యాక.. అందరూ ఈ సినిమా గురించే మాట్లాడుకొంటారు. త్వరలోనే పాటల్ని విడుదల చేస్తాము''అన్నారు. నేపథ్య సంగీతం పనులు జరుగుతున్నాయనీ, జూన్‌లో సినిమా రిలీజ్ చేస్తామనీ నిర్మాత సి.కల్యాణ్ పేర్కొన్నారు.

చార్మి మాట్లాడుతూ - ''కళ్లు మూసి తెరిచే లోపు ఈ సినిమా పూర్తయిపోయింది. నేను నిజజీవితంలో ఎలాగైతే ప్రవరిస్తానో, ఈ సినిమాలో అలాగే చేశాను. ఈ సినిమాలో నేను జీవించానంతే'' అని తెలిపారు.
పేరు క్యాచీగా ఉండాల‌ని ఆలోచిస్తే జ్యోతిలక్ష్మి అయితే బాగుంటుంద‌ని అది ఓకే చేశామ‌ని. అంతేగానీ ఈ సినిమా జ్యోతిల‌క్ష్మి నిజ జీవితానికి సంబంధం లేద‌ని పేర్కొన్నారు.

ఛార్మి కౌర్‌, సత్య, వంశీ ప్రధాన పాత్రల్లో రూపొందనున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: పి.జి.వింద, సంగీతం: సునీల్‌ కశ్యప్‌, నిర్మాతలు శ్వేతలానా, వరుణ్‌, తేజ,సి.వి.రావు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

English summary
RGV posted a picture of Charmi in Jyothi Laxmi film and tweeted : 'This Back Has More Fronts Than Many Fronts Have Backs.'
Please Wait while comments are loading...