వర్మ చిత్రం 'శబరి' విడుదల ఖరారు
రామ్ గోపాల్ వర్మ చిత్రం 'శబరి'ఎట్టకేలకు ఐదేళ్ళు బాక్స్ ల్లో మగ్గి విడుదలకు సిద్దమైంది. ఈ చిత్రం సరిగా రాకపోవటంతో రామ్ గోపాల్ వర్మ అప్పట్లో ఆపుచేసేసారు. అయితే ఈ చిత్రంలో కొన్ని మార్పులు చేర్పులు చేసి రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇషా కొప్పికర్ ప్రధాన పాత్రలే చేసిన ఈ చిత్రాన్ని లలిత్ మరాతే దర్శకత్వం వహించారు. ముంబయిలోని ఓ మురికివాడకి చెందిన మహిళ మట్కా సామ్రాజ్యాన్ని ఎలా శాసించింది? అనే అంశం చుట్టూ కథ తిరుగుతుంది. ఇక ఈ చిత్రాన్ని వర్మ ఆగస్టు 26న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం విడుదల కోసం ఎదురుచూస్తున్న దర్శకుడు మీడియాతో మాట్లాడుతూ..నేను ఓ కుక్కలా ఫీలవుతున్నాను..ఏదో రోజు నా శుక్రవారం వస్తుందని నమ్మకంతోనే ఉన్నాను అన్నారు. ఇక ప్రస్తుతం వర్మ..బెజవాడ రౌడీలు చిత్రం షూటింగ్ లోబిజీగా ఉన్నారు. అలాగే రూపొందించిన హిందీ చిత్రం ఇట్స్ నాట్ ఎ లవ్ స్టోరీ విడుదలకు సిద్దంగా ఉంది. త్వరలోనే డిపార్టమెంట్ చిత్రం ప్రారంభించనున్నారు. సంజయ్ దత్, అమితాబ్, రానా ప్రధానపాత్రల్లో ఈచిత్రం రూపొందనుంది. ఈచిత్రంలో లక్ష్మీ ప్రసన్నను కూడా తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











