ఫాంహౌస్‌‌కు అందుకే వెళ్తున్నాడా?.. ‘పవర్ స్టార్’లో బండ్ల గణేష్‌!

రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం పవర్ స్టార్ సినిమాపైనే పడ్డాడు. అది జనాల్లోకి వెళ్లేందుకు వర్మ చేసిన ప్రయత్నాలన్నీ ఫలించాయి. కేవలం వర్కింగ్ టైటిల్స్‌తోనే 'పవర్ స్టార్'పై అంచనాలు పెంచేశాడు. అచ్చం పవన్ కళ్యాణ్‌లా ఉండే టిక్ టాక్ స్టార్‌ను తీసుకొచ్చి మరీ పవర్ స్టార్ సినిమాను తీస్తున్నాడు. వర్మలో ఉన్న ప్రత్యేకతే అది. ఎలాంటి సినిమా తీసినా సరే అందులోని క్యాస్టింగ్ మాత్రం అదిరిపోతుంది. ఎక్కడి నుంచి ఆ నటీనటులను వర్మ పట్టుకొస్తాడని అంతా అనుకునేలా చేస్తాడు.

నాడు కూడా అదే..

నాడు కూడా అదే..

అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అనే చిత్రంలోనూ చంద్రబాబును పోలీ ఉండే నటుడిని వెతికి మరీ పట్టుకున్నాడు. అందరూ అతడిని చూసి ఆశ్చర్యపోయారు. తాజాగా పవర్ స్టార్‌లోనూ అతను నటిస్తున్నాడు. ఇప్పటికే పోస్టర్లు నానా రచ్చను క్రియేట్ చేశాయి.

ప్రచారం ఉధృతం..

ప్రచారం ఉధృతం..

ఇక పవర్ స్టార్ సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రచారాన్ని ఉధృతం చేశాడు. గడ్డితింటావా అనే ఓ పాటను నేటి సాయంత్రం విడుదల చేసి మరింత రచ్చ చేయాలని చూస్తున్నాడు. ఈ క్రమంలో ఓ ఫోటోను షేర్ చేసి.. అందరిలోనూ ఆసక్తిని క్రియేట్ చేశాడు.

బండ్ల గణేష్ పోలికలతో..

బండ్ల గణేష్ పోలికలతో..

పవర్ స్టార్ సినిమాలోని మరో క్యారెక్టర్ అంటూ వర్మ ఓ ఫోటో(బండ్ల గణేష్ పోలికలతో)ను షేర్ చేశాడు. ఆ నవ్వు, ఆ నడక, ఆ వేషధారణ, చెయ్యి పెట్టిన విధానం చూస్తుంటే అది ఎవరనేది ప్రతీ ఒక్కరికీ ఈజీగా అర్థమవుతుంది. ఆయన ఎవరిలానైనా కనిపిస్తున్నాడా? అని వర్మ అమాయకంగా అడగడంతో అందరూ వెరైటీగా కామెంట్స్ చేస్తున్నారు.

ఫాంహౌస్‌లో అలా..

ఫాంహౌస్‌లో అలా..

బండ్ల గణేష్ పోలికతో ఉన్న ఆ నటుడు ఫాంహౌస్‌కు వెళ్లినట్టు.. గుడికి వెళ్లి వస్తున్నట్టుగా బొట్టు చేతిలో ప్రసాదం కూడా ఉంది. దేవుడిలా భావించే తన హీరోను దర్శించుకోవడం కోసమే సదరు పాత్ర ఫౌంహౌస్‌‌కు వెళ్లినట్టు తెలుస్తోంది. తరువాత ఏం జరిగింతో తెలియాలంటే సినిమాను చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X