twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కేసీఆర్ 2.0 కాదు.. మహేష్ బాబు 'ఆగడు' స్పూఫ్‌తో ఆర్జీవీ కాంట్రవర్షియల్ వీడియో!

    |

    ఎప్పుడు ఎలాంటి సంఘటన జరిగినా దానితో పబ్లిసిటి ఎలా పొందాలి అని వివాదాల వర్మ ఆలోచిస్తుంటారు. నిన్ననే వెలువడిన తెలంగాణ ఎన్నికల ఫలితాలపై రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించాడు. కేసీఆర్ ని ప్రశంసిస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. చిత్ర పరిశ్రమ మొత్తం టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించినందుకు కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలియజేస్తోంది. రాంగోపాల్ వర్మ అందరిలో శుభాకాంక్షలు చేయకుండా ఓ వివాదాస్పద వీడియోని పోస్ట్ చేశాడు. వర్మ షేర్ చేసిన వీడియో కావడంతో ఎప్పటిలాగే అది వైరల్ గా మారుతోంది.

    కేసీఆర్ 2.0 కాదు

    కేసీఆర్ 2.0 కాదు

    వర్మ ట్విట్టర్ లో పేర్కొంటూ.. కేటీఆర్ గారు మీ తండ్రి కేసీఆర్ 2.0 కాదు. రజనీకాంత్ కంటే కేసీఆర్ 20.0 రెట్లు పెద్ద. మహేష్ బాబు కంటే 200.0 రెట్లు పెద్ద. ఇక నారా చంద్రబాబు నాయుడు కంటే 2000. రెట్లు పెద్ద అంటూ పేర్కొన్నాడు. అన్ని మీడియా సంస్థలు తెలంగాణ ఎన్నికల ఫలితాలపై కేసీఆర్ ని ప్రశంసిస్తూ ఆయన్ని కేసీఆర్2.0 అని సంభోదిస్తున్నాయి. కేసీఆర్ 2.0 కాదు అంతకంటే అడ్వాన్స్డ్ అని అర్థం వచ్చేలా ట్వీట్ చేశాడు.

    ఆగడు స్పూఫ్ వీడియో


    తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ ఏకపక్ష విజయాన్ని హైలైట్ చేసేలా వర్మ మహేష్ బాబు చిత్రం ఆగడు స్పూఫ్ వీడియోని పోస్ట్ చేశాడు. మహేష్ బాబు ముఖానికి కేసీఆర్ మాస్క్ తగిలించి విలన్ల ముఖాలకు చంద్రబాబు, లోకేష్, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదండరాం ఇలా మహా కూటమి నాయకుల మాస్క్ లు తగిలించారు. తెలంగాణ ఎన్నికల్లో వీరందరిని సింగిల్ హ్యాండ్ తో చిత్తు చేసిన వైనాన్ని చూపించారు.

    భైరవ గీత

    భైరవ గీత

    ఆ మధ్యన తాను నిర్మించిన భైరవ గీత చిత్రాన్ని సూపర్ స్టార్ రజని 2.0 కు పోటీగా దించబోతున్నట్లు వర్మ తెగ హడావిడి చేశాడు. పైగా 2.0 చిన్నపిల్లల సినిమా అంటూ కామెంట్స్ చేశాడు. కానీ భైరవ గీత చిత్రం విడుదల కాకుండా వాయిదా పడింది. ఈ చిత్రం ప్రస్తుతం డిసెంబర్ 14న విడుదలకు సిద్ధం అవుతోంది.

    యువ దర్శకుడు

    యువ దర్శకుడు

    వర్మ చిత్రాలకు అసిస్టెంట్ ఎడిటర్ గా పని చేసిన సిద్దూ ఈ చిత్రానికి దర్శకుడు. రాయలసీమ ఫ్యాక్షన్, ఎమోషనల్ లవ్ స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. భైరవ గీత చిత్రంలో అంతా నూతన నటీనటులు నటిస్తుండడం విశేషం. వర్మకు ఇటీవల దర్శకుడిగా సరైన విజయం లేదు. వర్మ చివరగా తెరకెక్కించిన ఆఫీసర్ చిత్రం దారుణంగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే.

    English summary
    RGV Shares controversial video on Telangana Election results 2018. KCR is bigger than NCBN
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X