For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రౌడీలంటే గౌరవం, అంబానీ రౌడీ కోణమే ‘సత్య2’: వర్మ

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : రౌడీలంటే తనకు ఎంతో గౌరవం అని, వారి మూలంగానే కాస్తూ కూస్తో ఫుడ్డు తింటున్నాను. వారి అంశాలతోనే సినిమా తీస్తున్నాను. రౌడీలు అనే వాళ్లు లేకుంటే నేను ఎలా ఉండే వాడినో తెలియదు. అందుకే వారంటే నాకు ఎంతో గౌరవం అని చెప్పుకొచ్చారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.

    గతంలో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'సత్య' చిత్రం మంచి విజయం సాధించిన నేపథ్యంలో.......ఇప్పటి పరిస్థితుల ఆధారంగా 'సత్య 2' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శర్వానంద్, అనైక జంటగా రూపొందిన 'సత్య 2' ట్రైలర్ హైదరాబాద్‌లో శుక్రవారం విడుదల చేసారు.

    ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ...1998లో వచ్చిన 'సత్య' అప్పటి పరిస్థితుల ఆధారంగా రూపొందించాం. అప్పటికి ఇప్పటికీ సమాజంలో చాలా మార్పు వచ్చింది. ఇప్పటి పరిస్థితుల ఆధారంగా ఈచిత్రం తెరకెక్కించాం. క్రైమ్ చేసే వ్యక్తి సైకాలజీ స్టడీ చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ధీరూబాయ్ అంబానీ లాంటి వ్యక్తి కార్పొరేట్ సంస్థల వైపు కాకుండా, అండర్ వరల్డ్ వైపు వెళ్లి ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందనేది ఈ సినిమాలో చూపిస్తున్నాం' అన్నారు.

    శర్వానంద్ మాట్లాడుతూ....రామ్ గోపాల్ వర్మ లాంటి బ్రిలియంట్ డైరెక్టర్ తో కలిసి పని చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇప్పటికి ఆ కల తీరింది. ఈ సినిమాలో కొత్తరకం క్రైమ్ కోణం ప్రేక్షకులు చూస్తారు. ఈ సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉందన్నారు.

    ఈ చిత్రాన్ని సుమంత్ మెట్టు, చంద్రశేఖర్ ...ముమ్మత్ మీడియా అండ్ ఎంటర్టెన్మెంట్ ప్రై.లి, జెడ్ 3 పిక్చర్స్ బేనర్‌లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : అమర్ మోహిలె, సినిమాటోగ్రఫీ : వికాస్ సారాఫ్, దర్శకత్వం రామ్ గోపాల్ వర్మ.

    English summary
    RGV-Sharwanand's 'Satya' trailer lanched. 'Satya-2', starring Sharwanandh in the lead role. This is the sequel of his super hit film, 'Satya', that was released in 1998. This film is also being made on a mafia backdrop.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X