Don't Miss!
- News పవన్ కళ్యాణ్‌ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు: ఫస్ట్ డే రెస్పాన్స్.. వర్మ షాకింగ్ రియాక్షన్
సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ రూపొందించిన సినిమా 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు'. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా పలు వివాదాలను అధిగమించి డిసెంబర్ 12వ తేదీన విడుదలైంది. అయితే ఈ సినిమా తొలిరోజు పర్ఫార్మెన్స్ ఎలా ఉందనే దానిపై వర్మ రియాక్ట్ అయ్యాడు. వివరాల్లోకి పోతే..
రామ్ గోపాల్ వర్మ అంటేనే స్పెషల్.. అందుకే
సాధారణంగా రామ్ గోపాల్ వర్మ అంటేనే స్పెషల్. ఆయన ఏది చేసిన ఏం మాట్లాడినా అందులో ఎంతో కొంత కొత్తదనం మాత్రం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కాస్త కొత్తగా ఆలోచించి తన సినిమాకు సంబంధించిన కలెక్షన్స్ గురించి తానే ప్రస్తావిస్తూ ట్వీట్ పెట్టాడు.
|
తొలిరోజు వసూళ్లు.. వర్మ రియాక్షన్
రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' సినిమా తొలిరోజు వసూళ్లు గర్జిస్తున్నాయని వర్మ పేర్కొన్నాడు. ‘తొలిరోజు కలెక్షన్లు గర్జిస్తున్నాయి. రియల్ క్యారెక్టర్స్‌పై కల్పిత పాత్రలతో కల్పిత సన్నివేశాలు తెరకెక్కించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ప్రజలు బాగా ఆదరించారని దీనిని బట్టే అర్థమవుతోంది' అంటూ రిలీజ్ ట్రైలర్స్ వీడియోను షేర్ చేశాడు రామ్ గోపాల్ వర్మ.
|
జనాలు ఎగబడుతున్నారు..
నిన్న డిసెంబర్ 12న విడుదలైన ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' సినిమా థియేటర్ల వద్ద జనాల సందడి కనిపించింది. ఆ సమయంలో తీసిన ఓ ఫొటోను కూడా ట్విటర్లో పోస్ట్ చేసిన వర్మ.. ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా కోసం జనాలు ఎగబడుతున్నారు. సినిమా టీంకు కంగ్రాట్స్' అని పేర్కొన్నాడు.
నేనే చెప్పుకుంటా.. అవసరమే లేదు
విడుదలకు ముందే పలు అప్డేట్స్ ద్వారా జనాల్లో ఈ సినిమాపై క్యూరియాసిటీ పెంచేసిన వర్మ.. విడుదలయ్యాక కూడా వదలడం లేదు. తన సినిమా గురించి తానే చెప్పుకుంటా అన్నట్లుగా సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా విశేషాలు చెబుతున్నాడు. ఇందులో భాగంగానే ఇలా తొలిరోజు వసూళ్ల గురించిన కామెంట్ పెట్టాడు వర్మ.
Recommended Video
అభ్యంతరాలు రావడంతో ఇలా..
మొదట ఈ సినిమాకు 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అని పేరుపెట్టిన వర్మ.. సెన్సార్ బోర్డు, పలు రాజకీయ పార్టీల అభ్యంతరాలు రావడంతో దానిని ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు'గా మార్చదు. ఒకదశలో ఈ సినిమా విడుదలవుతుందా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారి చివరకు ప్రేక్షకుల ముందుకొచ్చింది.