సెల్ ఫోన్ తో రామ్ గోపాల్ వర్మ చిత్రం...వివరాలు
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన తదుపరి చిత్రంగా సెల్ ఫోన్ తో తీస్తానని ప్రకటించాడు. ఆ చిత్రం టైటిల్ నవరసం. చిత్రం డ్యూరేషన్ కేవలం పది నిముషాలు మాత్రమే. యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేస్తానని చెప్పారు. అలాగే ప్రకాష్ రాజ్ ఈ చిత్రంలో నటిస్తారని అన్నారు. ఈ చిత్రంలో నటించే నటీనటులు, మిగతా వివరాలు త్వరలో ప్రకటిస్తానని అన్నారు. ఈ సినిమా చేయటానకి కారణం...తక్కువ టైమ్, తక్కువ టెక్నాలిజి, తక్కువ పెట్టుబడితో కూడా తీయవచ్చునని నిరూపించటమే అన్నారు. ఇక ఆయన తాజా చిత్రం దొంగల ముఠా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అయితే ఆయన ఈ చిత్రం సూపర్ హిట్ అని ప్రకటించారు. రవితేజ, ఛార్మి కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం ఆరున్నర లక్షల పెట్టుబడితో నిర్మించారు. అలాగే ఆయన రెడ్డిగారు పోయాక అనే చిత్రం కూడా ప్రకటించారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలకు అద్దం పట్టే చిత్రం అవుతుందని ఆయన ప్రకటించారు.


Click it and Unblock the Notifications











