twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాట్: మంచు లక్ష్మి పాదాలపై వర్మ ఇలా... (షార్ట్ ఫిల్మ్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన తొలి షార్ట్ ఫిల్మ్ ఇటీవల చిత్రీకరించిన సంగతి తెలిసిందే. మంచు లక్ష్మి పాదాలపై తీసిన ఈ షార్ట్ ఫిల్మ్ ఆమె పుట్టినరోజు సందర్బంగా ఈ రోజు యూట్యూబులో విడుదల చేసారు. ఆ షార్ట్ ఫిలింపై మీరూ ఓ లుక్కేయండి మరి.

    ఇటీవల తన షార్ట్ ఫిల్మ్ గురించి వర్మ ఇలా వివరించారు...

     RGV short film

    సినిమా అనేది ఒక ఎమోషనల్ ఎక్స్‌పీరియన్స్. అది ఏడిపించొచ్చు, నవ్వించొచ్చు, థ్రిల్ చేయొచ్చు లేదా ఆశ్చర్యపరచవచ్చు. కానీ ఈ ఎమోషన్స్‌లో ఏవైనా కూడా ఒక రెండు గంటలల నిడివి ఉండాల్సిన అవసరం లేదు. ఆ నిడివే యావరేజ్‌గా ఒక సినిమా లెంగ్తు. ఎన్నోసార్లు నాకు ఎన్ని ఎగ్జయిటింగ్ సినిమాటిక్ ఐడియాలొచ్చినా..అవి ఒక ఫీచర్ ఫిల్మ్ లెంగ్త్‌కి సరిపోవు గనుక వాటిని వదిలేయాల్సి వస్తుంది. కానీ నాకు సడన్ గా వచ్చిన ఐడియా ఏమిటంటే...షార్ట్ ఫిలింలో టైమ్ రెస్ట్రిక్షన్ ఉండదు కాబట్టి ఐడియాకి ఎంత నిడివి కావాలో అంత నిడివిలోనే సినిమా తీయవచ్చని. ఈ ఆలోచన రాగానే నేనొక షార్ట్ ఫిలిం ఐడియాతో లక్ష్మి మంచుని కలిసి తనతో నా ఐడియా చెప్పాను. నా ఐడియా విన్న వెంటనే ‘తన పాదాలను' నా షార్ట్ ఫిలింలో యాక్ట్ చేయించడానికి ఒప్పుకుంది. నా మొట్టమొదటి షార్ట్ ఫిలిం ‘లక్ష్మీ మంచు పాదాలు...జీవితంలో ఒకరోజు' నా ఈ షార్ట్ ఫిలింని ‘యూట్యూబ్'లో అక్టోబర్ 8న మంచు లక్ష్మి పుట్టినరోజున రిలీజ్ చేస్తున్నామన్నారు.

    English summary
    All set to showcase my maiden short film "A day of in the life of Lakshmi Manchu's feet" directed by Ram Gopal Varma. RGV's first short-film, the film includes many interesting and emotional elements which capture the heart of a viewer.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X