twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ గోపాల్ వర్మ ‘స్పాట్’ (ఆడియో పోస్టర్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ఎప్పుడూ వివాదాల్లో ఉండటంత...వివాదాస్పద అంశాలపై సినిమాలు తీయడం రామ్ గోపాల్ వర్మ స్టైల్. గతంలో ఆయన ఎన్నో వివాదాస్పద అంశాలపై సినిమాలు తీసారు. అందులో రాయలసీమ ప్యాక్షనిజంపై తీసిన ‘రక్త చరిత్ర' సినిమా ఓ సంచలనం. వర్మ తాజాగా ఓ రాయలసీమ నేత మర్డర్‌కు సంబంధించిన అంశంపై సినిమా తీస్తున్నాడు.

    ‘స్పాట్' పేరుతో తెరకెక్కుతున్న ఈచిత్రానికి ‘రక్త చరిత్ర వెనక అసలు చిత్ర' అనేది సబ్ టైటిల్. గతంలో వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘రక్త చరిత్ర' సినిమాకు దీనికి లింక్ ఉంది. ఎవరినైనా చంపడానికి స్పాట్ అనేది అందరూ ఈజీగా అనేస్తారు కానీ ఒక స్పాట్ పెట్టాలి అంటే దాని వెనుక ఎంత శ్రమ ఉంటుందనేది తెలుసుకున్న నేను షాక్ అయ్యాను. అందుకే రక్త చరిత్ర 1 లో పదే నిమిషాలు ఉన్న ఓబుల్ రెడ్డి హత్యని ఇప్పుడు పూర్తి సినిమాగా ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు అంటున్నాడు వర్మ.

    RGV Spot audio poster

    ఓబుల్ రెడ్డికి స్పాట్ పెట్టడానికి గల కారణం, అసలు వ్యక్తుల్ని, ఆ స్పాట్ వల్ల వచ్చిన పరిస్థితులను తెలుసుకున్నప్పుడు నాకు రోమాలు నిక్క బొడుచుకున్నాయి. అందుకే ఈ సినిమాకి స్పాట్ అనే టైటిల్ పెట్టి ఓబుల్ రెడ్డి స్పాట్ ని సినిమాగా తీస్తున్నానని చెబుతున్నాడు వర్మ. మరి ఈ స్పాట్ ఇంకెన్ని కాంట్రవర్శీలు క్రియేట్ చేస్తుందో చూడాలి. తాజాగా ‘స్పాట్' మూవీ ఆడియో పోస్టర్ విడుదల చేసారు. ఆ వీడియోలో వర్మ ఏం చెప్పాడో మీరూ ఓ లుక్కేయండి.

    English summary
    Raktha charitra venuka asalu charitra "Spot" audio poster Released.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X