twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గాడ్సేపై సినిమా తీస్తా.. నాగబాబు చెప్పింది నిజమే.. వర్మ సంచలన కామెంట్స్

    |

    మెగా బ్రదర్ నాగబాబు నాథురాం గాడ్సేపై చేసిన ట్వీట్ పెను సంచలనంగా మారింది. గాడ్సే పుట్టిన రోజు సందర్భంగా నాగబాబు చేసిన ఈ ట్వీట్‌లో ఆయన్ను ఓ దేశ భక్తుడిగా కీర్తించాడు. ఇక ఈ ట్వీట్‌పై రాజకీయ నాయకలు భగ్గుమన్నారు. నెటిజన్స్ సైతం నాగబాబు కామెంట్స్‌ను తప్పుబట్టారు. దీంతో దెబ్బకు దిగి వచ్చి.. వివరణ కూడా ఇచ్చుకున్నాడు.

    తనను తప్పుగా అర్థం చేసుకున్నారని, ఆయన చేసిన నేరాన్ని సమర్థించలేదని వివరణ ఇచ్చుకున్నాడు. తాజాగా ఈ కామెంట్లపై రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ.. నాగబాబుకు మద్దతుగా నిలిచాడు. అంతేకాకుండా గాడ్సేపై ఓ సినిమా తీస్తానని కూడా ప్రకటించాడు. ఆ విశేషాలేంటో ఓ సారి చూద్దాం.

    గాడ్సేపై ట్వీట్.. ఆత్మ రక్షణలో నాగబాబు.. ఘాటుగా విజయశాంతి కౌంటర్గాడ్సేపై ట్వీట్.. ఆత్మ రక్షణలో నాగబాబు.. ఘాటుగా విజయశాంతి కౌంటర్

    కాంట్రవర్సీ ట్వీట్..

    కాంట్రవర్సీ ట్వీట్..

    నాగబాబు చేసిన ట్వీట్ల సారాంశం.. ‘ఈ రోజు నాథూరాం గాడ్సే పుట్టిన రోజు. నిజమైన దేశ భక్తుడు. గాంధీని చంపడం కరెక్టా కాదా? అనేది చర్చనీయాంశం. కానీ, అతని వైపు వాదనను ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదు. కేవలం మీడియా అధికార ప్రభుత్వానికి లోబడి పనిచేసింది. (ఈ రోజుల్లో కూడా చాలా వరకు ఇంతే)' అని చెప్పారు.

    ఆయన దేశభక్తిని శంకించలేం...

    ఆయన దేశభక్తిని శంకించలేం...

    'గాంధీని చంపితే ఆపఖ్యాతి పాలవుతానని తెలిసినా తను అనుకున్నది చేశాడు. కానీ, నాథూరాం దేశభక్తిని శంకించలేము. ఆయన ఒక నిజమైన దేశభక్తుడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయనని ఒక సారి గుర్తు చేసుకోవాలనిపించింది. పాపం నాథూరాం గాడ్సే. మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్'అని పేర్కొన్నాడు.

    నాగబాబు వివరణ...

    నాగబాబు వివరణ...

    ఈ ట్వీట్లపై తీవ్ర వ్యతిరేకత రావడంతో వివరణ ఇచ్చుకున్నాడు. ‘దయచేసి అందరూ నన్ను అర్థం చేసుకోండి. నేను నాధురాం గురించి ఇచ్చిన ట్వీట్‌లో నాధురాం చేసిన నేరాన్ని సమర్ధించలేదు. నాధురాం వెర్షన్ కూడా జనానికి తెలియాలని మాత్రమే అన్నాను. నాకు మహాత్మగాంధీ అంటే నాకు చాలా గౌరవం. వాస్తవానికి నన్ను విమర్శించే వల్లకన్నా నాకు ఆయనంటే చాలా గౌరవమ'ని చెప్పుకొచ్చాడు.

    మద్దతిచ్చిన వర్మ..

    మద్దతిచ్చిన వర్మ..

    నాగబాబు వ్యాఖ్యలకు మద్దితిచ్చిన వర్మ ఓ మీడియాతో మాట్లాడుతూ.. ‘నాథూరాం గాడ్సే.. గాంధీని చంపాడని మాత్రమే చెబుతున్నారు. కానీ ఎందుకు చంపాడో అనే విషయాన్ని ఎవరూ చెప్పడం లేదు. గాంధీని గాడ్సే ఎందుకు చంపాడనే విషయం తెలియకపోవడం వల్లే అతడు విలన్‌గా మారిపోయాడు. గాడ్సే మామూలుగా గాంధీకి ఫాలోవర్. స్వాతంత్రం వచ్చేసింది. భారత్-పాక్ విడిపోయాయి. గాడ్సే కోరుకున్న రెండూ జరిగిపోయాయి.

    గాడ్సేపై సినిమా..

    గాడ్సేపై సినిమా..

    అయినా కూడా ఎందుకు చంపాల్సి వచ్చింది. ఆ విషయాన్ని అప్పటి ప్రభుత్వం బయటకు రానివ్వలేదు. ఎందుకంటే ఆ టైమ్‌లో అది కరెక్ట్ కాదు. అప్పుడప్పుడే స్వాతంత్ర్యం వచ్చింది. గాంధీని జాతిపిత అని చెప్పాం. దాని తర్వాత ఆయన హత్యకు గురయ్యారు. అలాంటి పరిస్థితిలో గాంధీని ఎందుకు చంపారనే విషయాన్ని బయటకు తీసుకురావడం కరెక్ట్ కాదని భావించి తొక్కిపెట్టారు. ఏది ఏమైనా గాడ్సే దేశభక్తి విషయంలో నాగబాబు గారి వ్యాఖ్యలతో నేను ఏకీభవిస్తా'నని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా... గాడ్సే కథాంశంతో తాను సినిమా తీయబోతున్నట్లు ఓ బాంబ్ పేల్చాడు.

    English summary
    RGV Supports Nagababu Comments on Nathuram Godse. He Anounced That He Wanst To Da O Film On Nathuram Godse.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X