ఎన్టీఆర్ తో రామ్ గోపాల్ వర్మ సినిమా?

అప్పటినుంచీ దాదాపు కమర్షయల్ హీరోలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అందులోనూ ఆయనవన్నీ డైరక్టర్ ఓరియెంటెడ్ ఫిల్మ్ కావటంతో హీరోలకు పెద్దగా ప్రాధాన్యత ఉండదని,పాటలు కామిడీ వంటివి ఉండవని పెద్ద హీరోలెవ్వరూ ఆయన జోలికి పోరు. ఇక ఈ విషయం గురించే ఆయన మాట్లాడుతూ నేను మొదట్నించీ పెద్ద ఎన్టీఆర్ అభిమానిని. ఆయన సినిమాలు చాలా ఎక్కువగా చూసేవాణ్ని.
ఎప్పటికైనా ఆయనతో సినిమా తీయాలనుకొన్నాను. కానీ కుదర్లేదు. ఇప్పుడు నాకు వీలున్నది జూనియర్ ఎన్టీఆర్‌తోనే. ఆ సినిమా ఇంకా ఆలోచన దశలోనే ఉంది. ఇక ఎలాంటి చిత్రం తీస్తారు? అన్న దానికి సమాధానంగా అతనో స్టార్ ఇమేజ్ ఉన్నవాడు. దాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. 'ఆది' నుంచి 'కంత్రి' వరకూ వచ్చిన ఎన్టీఆర్ చిత్రాలు చూశాను. చూద్దాం భవిష్యత్ లో అంటూ దాటేసారు. ఈ కాంబినేషన్ వర్కవుట్ అయితే మళ్ళీ శివ నాటి పరిస్ధితి రిపీట్ అవుతుందని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.


Click it and Unblock the Notifications











