twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దానికి నన్నే టార్గెట్ చేస్తున్నారు...రామ్ గోపాల్ వర్మ

    By Srikanya
    |

    ఈ మధ్య తెలుగు చిత్ర పరిశ్రమలో నేను వచ్చిన తర్వాత అనేక స్కామ్‌లు, గొడవలు జరుగుతున్నాయని కొందరు అంటున్నారు. దానికి నన్నే టార్గెట్ చేస్తున్నారు. నన్ను పెద్ద మాఫియాను అని అంటున్నారు. వాళ్లు ఎలా అనుకుంటే అలా అనుకోమనండి. తప్పు ఏమీలేదు అంటున్నారు రామ్ గోపాల్ వర్మ. రీసెంట్ గా ఆయన అప్పల్రాజు ప్రమోషన్ నిమిత్తం మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే...నేను తెలుగు సినిమాలు తియ్యనని అన్నమాట నిజమే. కానీ నేను మాట మీద నిలబడే రకం కాదు. పొద్దున వచ్చిన ఐడియా సాయంత్రానికి బోరు కొడుతుంది. నాతో ఎవరైనా మంచిగా మాట్లాడితే, వారిని చూస్తే భయమేస్తుంది. రామ్‌గోపాల్‌వర్మగారు అనే వాళ్లకన్నా రాముగాడు అంటేనే నాకిష్టం...అంటూ చెప్పుకొచ్చారు. ఇక తన ప్యూచర్ ప్రాజెక్టుల గురించి చెబుతూ..'బెజవాడ రౌడీలు" స్క్రిప్ట్ పూర్తయింది. 'అమ్మ" చిత్రానికి సీజ్ ఎఫెక్ట్స్, సెట్స్ ఎక్కువ వేయాల్సిన అవసరం ఉంది. అందుకే లేట్ అవుతుంది. ఆగస్టులో ప్రారంభం కావచ్చు. అలాగే పొలిటికల్ ఫిలిమ్ ఎప్పటికైనా ఒకటి తీస్తాను అన్నారు.

    English summary
    RGV is a true manipulator of people, and it helps him in his craft, as director need to manipulate with peoples emotions. He brings out the best out of his cast and crew by using that manipulation. The reason why he is in love with film, is because he doesn't need to go through hoops of manipulation to extract exceptional work for that.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X