twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లైంగిక వేధింపులు: నానా పాటేకర్ ఎలాంటోడో బయటపెట్టిన రామ్ గోపాల్ వర్మ

    |

    Recommended Video

    RGV Talks About Nana Patekar Issue

    బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో #మీటూ ఉద్యమంలో భాగంగా పదేళ్ల క్రితం 'హార్న్ ఓకే ప్లీజ్' సెట్లో తాను ఎదుర్కొన్న సంఘటన వెల్లడించడం, ప్రముఖ నటుడు నానా పాటేకర్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, లైంగికంగా వేధించాడని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆమె ఆరోపణలు మీడియాలో సెన్సేషన్ కావడంతో పాటు దేశ వ్యాప్తంగా #మీటూ ఉద్యమం ఉధృతం అయ్యేలా చేసింది. ఈ నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో నానా పాటేకర్ అనే వ్యక్తి ఎలాంటి వాడో వెల్లడించే ప్రయత్నం చేశారు.

    సవతి తల్లి సోదరుడి నిజాలు బయటకు.. శరత్ కుమార్ కుమార్తె ఏం చేసిందో తెలుసా!సవతి తల్లి సోదరుడి నిజాలు బయటకు.. శరత్ కుమార్ కుమార్తె ఏం చేసిందో తెలుసా!

    పరిశ్రమలో లైంగిక వేధింపులు నిజమే

    పరిశ్రమలో లైంగిక వేధింపులు నిజమే

    సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులు జరుగుతున్న మాట వాస్తవమేనని, చాలా సార్లు తాను ఇలాంటి వాటి గురించి విన్నానని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తెలిపారు. ఇలాంటివి జరుగుతున్నపుడు తనుశ్రీ దత్తా అయినా, మరెవరైనా ధైర్యంగా ముందుకొచ్చి చెప్పడం అభినందనీయమని పేర్కొన్నారు.

    తనుశ్రీ దత్తా-నానా పాటేకర్ మధ్య ఆ రోజు ఏం జరిగిందో తెలియదు

    తనుశ్రీ దత్తా-నానా పాటేకర్ మధ్య ఆ రోజు ఏం జరిగిందో తెలియదు

    ఆ రోజు తనుశ్రీ దత్తా-నానా పాటేకర్ మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు. ఈ ఇన్సిడెంట్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. నాకు తెలిసిన నానా పాటేకర్ ఎలాంటి వాడు, అతడితో నాకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ ఎదురయ్యాయో చెప్పాలనుకుంటున్నాను అని వర్మ తన వాదన మొదలు పెట్టారు.

     అలాంటి వాడంటే నమ్మను

    అలాంటి వాడంటే నమ్మను

    నానా పాటేకర్ ఇతరులను కావాలని వేధిస్తాడు, బాధ పెట్టే ప్రయత్నం చేస్తారు అనే విషయం అయితే నేను నమ్మను. నేను మొదటిసారి బాంబే వెళ్లినపుడు అతి కష్టం మీద అతడి ఫోన్ నెంబర్ కనుక్కుని ఫోన్ చేశాను. సాధారణంగా మనం ఫోన్ చేసినపుడు అవతలి వైపు నుండి హలో అనే పదం ఆశిస్తాం. నానా ‘బోల్'(చెప్పు) అంటూ మొదలు పెట్టారు. నా పేరు రామ్ గోపాల్ వర్మ... హైదరాబాద్ నుండి వచ్చాను, మిమ్మల్ని కలవాలి అనగానే రమ్మని చెప్పారు అని గుర్తు చేసుకున్నారు.

    నన్ను కూడా తిట్టాడు

    నన్ను కూడా తిట్టాడు

    నేను ఆయనకు కథ చెబుతుండగా మధ్యలో చాయ్ తాగుతావా అని అడిగాడు. అవును అనగానే కిచెన్‌లోకి వెళ్లి నాక్కూడా ఒక టీ చేసుకుని రమ్మని చెప్పారు. అయితే నాకు చాయ్ చేయడం రాదని చెప్పడంతో ఇన్నేళ్లు వచ్చినా చాయ్ చేయడం రాదా? అంటూ తిట్టాడు. వెంటనే మా అమ్మకు ఫోన్ కలపమని చెప్పి ఆమెతో మాట్లాడారు. మీ వాడికి చాయ్ చేయడం కూడా నేర్పలేదా అంటూ అడిగారు. ఆయనలో సగం నటుడు, సగం మంచి హ్యూమన్ బీయింగ్ కనిపిస్తాడు. ఆయన గురించి బాగా తెలిసిన వారు నానాను ఇష్టపడతారు. ఆయన ఒక స్పెషల్ పర్సన్.. అని వర్మ తెలిపారు.

     అతడిని రోడ్డు మీదే బూతులు తిట్టాడు

    అతడిని రోడ్డు మీదే బూతులు తిట్టాడు

    పూణెలో కూడా ఆయనతో మరో అనుభవం ఎదురైంది. మేము కారులో వెళుతుండగా మా ముందు ఒక బైక్ వెళుతుంది. వెంటనే అతడికి కట్ కొట్టిన నానా బూతులు తిట్టడం మొదలు పెట్టాడు. ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. అతడు రోడ్డు మీద ఊమ్మి వేస్తూ ఏదో చెత్త వేస్తున్నాడు. ఒక పౌరుడిగా నానా తన బాధ్యత నిర్వర్తిస్తూ బూతులు తిడుతూ అతడికి క్లాస్ పీకాడు. అతడు చేసింది తప్పా, రైటా నాకు తెలియదు. వారు ఉంటున్న సిటీని చెత్త చెత్తగా చేస్తూ నాశనం చేస్తున్నావనే కోపం, ఇంటెన్షన్ అతడిలో కనిపించింది.

     గొప్ప యాక్టర్, గొప్ప సేవా పరుడు

    గొప్ప యాక్టర్, గొప్ప సేవా పరుడు

    పని విషయంలో నానా పాటేకర్ చాలా పాషన్‌తో ఉంటారు. ఎవరైనా సరిగా నటించక నిర్లక్ష్యం చేసినా,, తనలాగా పాషన్‌తో ఉండక పోతే వారిని కొట్టడానికి కూడా వెళతాడు. ఇక చారిటీలో అతడు ఎంతో గొప్పవాడు. అతడి రెమ్యూనరేషన్ 4 కోట్లు అయితే... 2 కోట్లు తనకు ఇవ్వమని, రెండు కోట్లు చారిటీ సంస్థకు ఇవ్వాలని కోరుతాడు. అది కూడా నిర్మాత పేరు మీదనే. ఆ పేరు కూడా తనకు దక్కాలని కోరుకోడని వర్మ అన్నారు.

    నా జీవితంలో చూసిన గొప్ప వ్యక్తి

    నా జీవితంలో చూసిన గొప్ప వ్యక్తి

    నా జీవితంలో చూసిన ఫైనెస్ట్ హ్యూమన్ బీయింగ్ నానా పాటేకర్. నటుడిగా అతడు అద్భుతం. అతడు మంచి హ్యూమన్ బీయింగ్ కాబట్టే అతడి నుండి అంత మంచి నటన వస్తుందని నేను భావిస్తాను.

    తనుశ్రీని అలా చేశాడంటే నమ్మను

    తనుశ్రీని అలా చేశాడంటే నమ్మను

    తనుశ్రీ దత్తా విషయంలో అతడు అసభ్యంగా ప్రవర్తించాడనే నేను నమ్మను. వాస్తవానికి ఆ రోజు ఏం జరిగిందో కూడా నాకు తెలియదే. ఆ తర్వాత తనుశ్రీ దత్తా కారు మీద జరిగిన దాడి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకు కంటే ఆ ఇన్సిడెంట్ గురించి నాకు తెలియదు అని రామ్ గోపాల్ వర్మ అన్నారు.

    English summary
    Ram Gopal Varma too has come out and opined on Tanushree Dutta’s allegations against Nana Patekar. But unlike the majority of Bollywood, RGV has chosen to side with Nana Patekar emphasising that the veteran actor while being hot-headed would never do anything that would hurt anyone.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X