టార్గెట్ పవన్ కల్యాణ్..సినీ హిస్టరీలో ఎన్నడూలేని విధంగా వర్మ స్ట్రాటజీ..పవర్‌స్టార్ రిలీజ్ ఆ రోజునే
సినీ పరిశ్రమలో సంచలనాలకు, వివాదాలకు మారుపేరైన రాంగోపాల్ వర్మ మరోసారి తన పేరును సార్థకం చేసుకోబోతున్నారు. పవన్ కల్యాణ్ టార్గెట్ చేస్తూ రూపొందించిన పవర్ స్టార్ సినిమా విషయంలో కొన్ని సంచలన విషయలకు, ట్రెండ్ సెట్ చేసే అంశాలకు బాట వేయబోతున్నాడు. తనదైన శైలిలో సినిమాపై క్రేజ్ సంపాదించడానికి, భారీ ఎత్తున కలెక్షన్లు రాబట్టడానికి సరికొత్తప్లాన్ రచించారు. పవర్ స్టార్ సినిమాతో రాంగోపాల్ వర్మ మరో సరికొత్త చర్చకు ఇండస్ట్రీలో బీజం వేయబోతున్నారు. అందుకోసం ఆర్జీవి ఏం చేయబోతున్నారంటే..
Recommended Video

పవన్ కల్యాణ్ లైఫ్‌లో కొన్ని అంశాలను
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జీవితంలోని కొన్ని ముఖ్య అంశాల ఆధారంగా పవర్ స్టార్ సినిమాను రూపొందించనున్నట్టు సమాచారం. అయితే తన సినిమాకు పవన్ లైఫ్‌కు సంబంధం లేదని చెబుతున్నప్పటికీ.. ఈ సినిమా పవర్ స్టార్ గురించే అనే విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమాలో జనసేన పార్టీ పేరును మన సేన అని వాడుతున్నట్టు తెలిసింది. అలాగే 2019 ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన విషయాల ఆధారంగా సినిమా నడుస్తుందనే తాజా సమాచారం.

జనసేన కాదు.. మన సేనగా
2019 ఎన్నికల ఫలితాలు అనంతరం మానసికంగా బలహీన పడ్డిన పవన్ కల్యాణ్ అనే విషయంపై వర్మ తన, కథ, కథనాలపై ప్రధానంగా దృష్టి సారించినట్టు సమాచారం. ఎన్నికలు, పార్టీ పరంగా పవన్‌కు సన్నిహితులు ఎలా సహకారం అందించారు? మరి కొందరు ఎలా వెన్నుపోటు పొడిచారు అనే విషయాలను తన పవర్ స్టార్ చిత్రంలో ప్రస్తావించబోతున్నట్టు తెలిసింది.

జూలై 16న ట్రైలర్ రిలీజ్
పవర్ స్టార్ సినిమా విషయానికి వస్తే జూలై 13 తర్వాత ట్రైలర్ లాంచ్‌కు డేట్ ప్రకటించనున్నట్టు తెలిసింది. జూలై 16న 11 గంటలకు ఆర్జీవీ థియేటర్‌లో రిలీజ్ కాబోయే పవర్ స్టార్ ట్రైలర్‌లో కొన్ని సెలెక్టెడ్ ఫోటోలు, గడ్డి తింటావా? అనే పాటను ట్రైలర్‌గా రిలీజ్ చేయబోతున్నట్టు విశ్వసనీయ సమాచారం.

పవర్ స్టార్ ట్రైలర్ టికెట్ ధర రూ.50
ఇక తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నడూ లేని విధంగా వర్మ కొత్త ప్రయోగానికి తెర లేపుతున్నారు. ఆర్జీవి వరల్డ్ థియేటర్‌లో రిలీజ్ చేసే పవర్ స్టార్ ట్రైలర్‌కు టికెట్ పెడుతున్నట్టు తెలిసింది. పవర్ స్టార్ ట్రైలర్‌ను చూడాలనుకొంటే ఆర్జీవి థియేటర్‌లో రూ.50 టికెట్ పెట్టి చూడాల్సిందేనట. అంతేకాకుండా సినిమా రిలీజ్ విషయంలో కూడా సరికొత్త పంథాను వర్మ మొదలు పెట్టపోతున్నారట.

జూలై 17 అడ్వాన్స్ బుకింగ్..
జూలై 16న ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమా తేదీని ప్రకటించనున్నారు. జూలై 17వ తేదీన 11 గంటలకు సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేస్తారట. ఆ టికెట్ ఖరీదు రూ.125 అని తెలిసింది. ఆ టికెట్ కేవలం 21 జూలై 11 గంటల వరకే వాలిడిటీ ఉంటుంది. ఆ తర్వాత పవర్ స్టార్ టికెట్ ధరను డిమాండ్ దృష్టిలో పెట్టుకొని రూ.250 లుగా నిర్ణయిస్తారని తాజా సమాచారం.

జూలై 21న పవర్ స్టార్ రిలీజ్
ప్రస్తుతం వర్మ ప్రణాళిక ప్రకారం పవర్ స్టార్ సినిమాను జూలై 21వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు. అలాగే జూలై 19వ తేదీన సినిమా స్టిల్స్‌తోపాటు లిరికల్ వీడియోను కూడా విడుదల చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. అంతేకాకుండా జూలై 21 తేదీన పవర్ స్టార్ సినిమాతోపాటు థ్రిల్లర్ సినిమా ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేయాలని నిర్ణయించినట్టు పక్కా సమాచారం తెలిసింది.


Click it and Unblock the Notifications











