అప్సరకు ఆర్జీవీ పెట్టిన రేటు ఇదే.. ‘థ్రిల్లర్’ చూడాలంటే అంత మొత్తం చెల్లించాల్సిందే!!

ఆర్జీవీకి ఉన్న తెలివి మరొకరి ఉండదేమోనని కొన్ని సార్లు అనిపిస్తుంది. అదే విధంగా ఆర్జీవీ అంత భిన్నంగా ఉండేవారు కూడా ఎవరూ ఉండరేమోనని మరి కొన్నిసార్లు అనిపిస్తుంది. ఏది ఏమైనా ఆర్జీవీ స్టైలే వేరు. లాక్ డౌన్ వల్ల అందరూ సినిమాలు ఎలా తీయాలు, డబ్బులు ఎలా సంపాదించుకోవాలో తెలియక సతమతమవుతుంటే ఆర్జీవీ మాత్రం ఊపిరి తీసుకునేంత గ్యాప్ కూడా ఇవ్వడం లేదు. వరుసగా సినిమాలను రిలీజ్ చేస్తున్నాడు. చేతి నిండా డబ్బు సంపాదిస్తున్నాడు.

క్లైమాక్స్‌తో మొదలు..

క్లైమాక్స్‌తో మొదలు..

ఆర్జీవీ క్లైమాక్స్ సినిమాతో ఓటీటీకి తెరదీశాడు. ఆర్జీవీ వరల్డ్ థియేటర్ అంటూ సొంత యాప్‌ను క్రియేట్ చేసిన శ్రేయాస్ ఎంటర్టైన్మెంట్స్‌తో సంయుక్తంగా సినిమాలను రిలీజ్ చేస్తున్నాడు. అత్యంత తక్కువ బడ్జెట్‌లో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. కానీ లాభాలు మాత్రం కళ్లు చెదిరేలా ఉంటున్నాయి.

నగ్నం, పవర్ స్టార్..

నగ్నం, పవర్ స్టార్..

నగ్నం అంటూ రెండు తెలుగు రాష్ట్రాల్లో సెగల పుట్టించిన ఆర్జీవీ.. స్వీటీ (శ్రీ రాపాక) అందాలను పరిచయం చేశాడు. ఇక పవర్ స్టార్ అంటూ వివాదాన్ని తారాస్థాయికి తీసుకెళ్లి లాభాలను గడించాడు. ఈ రెండు చిత్రాలకు ఆర్జీవీ పెట్టింది చాలా తక్కువే కానీ వచ్చిన లాభాలు మాత్రం ఊహించలేనంత.

లాభాల పంట..

లాభాల పంట..

క్లైమాక్స్ వంద రూపాయలు, నగ్నంకు రెండొందల రూపాయలు, పవర్ స్టార్‌కు 150, 300 అంటూ రేటును ఫిక్స్ చేశాడు. జనం కూడా విరగబడి చూశారు. దీంతో ఆర్జీవీకి లాభాల పంట పండింది. ఇక ఇదే లాజిక్‌ను ఉపయోగిస్తూ ఆర్జీవీ ముందుకు సాగుతూనే ఉన్నాడు. అందాల వల వేసి అందర్నీ పట్టేసుకుంటున్నాడు. థ్రిల్లర్ చిత్రంలో అప్సర అందాలను ఎరగా వేశాడు.

Recommended Video

Adire Abhi Opinion On RGV || గొప్ప సినిమాలు తీసిన మీరు.. ఇప్పుడేంటి ఇలా.?
థ్రిల్లర్ రేటు ఎంతంటే..

థ్రిల్లర్ రేటు ఎంతంటే..

క్లైమాక్స్ సినిమాలో మియా మాల్కోవా అందాలను చూడాలంటే వంద రూపాయలు పెట్టిన ఆర్జీవీ.. శ్రీరాపాక అందాలను చూడాలంటే రెండొందలని ప్రటించాడు. తనకు భారత స్త్రీలంటేనే ఎక్కువ ఇష్టమని అందుకే రెండొందలుగా టికెట్ రేటును ఫిక్స్‌ చేశాడు. ఇక తాజాగా అప్సర అందాలకు కూడా రేటు ఫిక్స్ చేశాడు. ఆగస్ట్ 14న రాత్రి తొమ్మిది గంటలకు రిలీజ్ కాబోయే చిత్రాన్ని రెండొందలు పెట్టి వీక్షించవచ్చని తెలిపాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X