వర్మ అజ్ఞాతం!

దీని పేరు 'అజ్ఞాత్'. ఈ హిందీ సినిమా షూటింగ్‌ని కేవలం 35 రోజుల్లో పూర్తి చేయాలనుకొంటున్నారు. అజ్ఞాతంగా ఉంటూ మనుషుల్ని చంపే ఓ శక్తి చుట్టూ అల్లుకొన్న కథ ఇది. అలా చంపుతున్నది జంతువా? మనిషా? ఏదైనా ప్రేతాత్మ? అన్నది సస్పెన్స్. భారీగా స్పెషల్ ఎఫెక్ట్స్‌తో దీన్ని తీర్చిదిద్దాలనుకొంటున్నారు. వర్మ సినిమాల్లో స్పెషల్ ఎఫెక్ట్స్ ఎక్కువ మోతాదులో ఉండే చిత్రం ఇదే కావచ్చు. శ్రీలంకలో చిత్రీకరణ ఉంటుంది. మరి వర్మకిష్టమైన ధ్రిల్లర్ ఫార్మెట్ లో ఈ చిత్రం నడుపుతున్నాడు కాబట్టి సినిమా మంచి విజయం సాధించే అవకాశం ఉందని ఆయన అభిమానులు అప్పుడే ఎదురుచూడటం ప్రారంభమైంది.


Click it and Unblock the Notifications











