చాలా కష్టం, ఏ సినిమాకు ఇది మ్యాచ్ అవ్వదు: మహేష్ బాబు మల్టీప్లెక్స్‌పై వర్మ!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఏసియన్ సినిమాస్ వారితో కలిసి 'ఎఎంబి సినిమాస్' అనే మల్టీప్లెక్స్ నిర్మించి బాక్సాఫీస్ బిజినెస్‌లోని దిగిన సంగతి తెలిసిందే. ఈ మెగా మల్టీప్లెక్స్‌లో సినిమా చూసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
మహేష్ బాబుకు చెందిన ఎఎంబి సినిమాస్‌లో మూవీ చూశాను. చూశాక నాకు ఓ విషయం అర్థమైంది. ప్రతి సినిమాకు ఇక్కడ ఓ సమస్య ఉంటుంది. ఎందుకంటే ఈ సూపర్ మల్టీప్లెక్స్‌తో మ్యాచ్ అవ్వడం ఏ సినిమా వల్ల కాదు. ఇదొక వండర్ ఫుల్ ప్లేస్ అంటూ రామ్ గోపాల్ వర్మ ప్రశంసల వర్షం కురిపించారు.
ఈ థియేటరే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్
ఈ థియేటర్ ఒక సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్.... ఏ సినిమా అయినా ఈ థియేటర్ స్థాయిని అందుకోవడం అంటే మామలూ విషయం కాదు. ఈ థియేటర్లో విడుదలవ్వడానికి వచ్చే ప్రతి సినిమాకు ఇది ఒక సవాల్ అంటూ వర్మ తనదైన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఆ ట్వీటుకు వర్మ థంబ్స్ అప్
రామ్ గోపాల్ వర్మ చిత్రం ‘భైరవ గీత'ను విడుదల చేయబోతున్న అభిషేక్ పిక్చర్స్ వారు ‘ఎఎంబి సినిమాస్' యజమానులైన మహేష్ బాబు, సునీల్ నారంగ్, భరత్ నారంగ్‌లకు కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్ చేయగా... వర్మ థంబ్స్ అప్ చెప్పారు.

భైరవ గీత తొలి షో ఇక్కడే చూబోతున్న వర్మ
డిసెంబర్ 14న తెలుగులో విడుదల కాబోతున్న ‘బైరవగీత' చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ తొలి షో మహేష్ బాబు థియేటర్లోనే చూబోతున్నట్లు తెలుస్తోంది. వర్మ చేసిన ట్వీట్ బట్టి ‘భైరవగీత' కూడా ఎఎంబి సినిమాస్ స్థాయిని అందుకునే రేంజిలో ఉండబోతని స్పష్టం అవుతోంది.
భైరవగీత రిలీజ్ సమస్య
కన్నడలో ముందుగా అనుకున్న ప్రకారమే డిసెంబర్ 7న 'భైరవ గీత' విడుదలవుతుండగా తెలుగులో మాత్రం డిసెంబర్ 14న విడుదల చేయబోతున్నారట. ఈ విషయాన్ని రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. సినిమా స్క్రీన్లు, ప్రచార కార్యక్రమాలకు సంబంధించిన సమస్యతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.


Click it and Unblock the Notifications











