యాంకర్‌తో డిగ్గీరాజా ఎఫైర్‌పై వర్మ కామెంట్!

వర్మ దిగ్విజయ్-అమృతరాయ్ ఎఫైర్‌పై ఇంతగా ఫోకస్ పెట్టాడంటే....వీరి స్టోరీ ఆధారంగా సినిమా ఏమైనా తీస్తాడా? అనే అనుమానాలు సైతం పలువురు వ్యక్తం చేస్తున్నాడు. వర్మ నిజజీవితంలో జరిగిన సంఘటలను తీసుకుని సినిమాలు తీయడంలో దిట్ట అనే సంగతి తెలిసిందే.
కాగా....తనకు టీవీ యాంకర్ అమృతా రాయ్ సంబంధం ఉందని దిగ్విజయ్ సింగ్ రెండు రోజుల క్రితం అంగీకరించారు. అమృతా రాయ్‌తో తాను కలిసి ఉన్న చిత్రాలు ఇంటర్నెట్ ద్వారా బయపడిన నేపథ్యంలో దిగ్విజయ్ సింగ్ ఆ విషయాన్ని అంగీకరించారు. అమృతా రాయ్‌తో సంబంధాన్ని అంగీకరించడంలో తనకేమీ ఇబ్బంది లేదని ఆయన అన్నారు. ఆమె తన భర్తతో విడాకులకు దరఖాస్తు చేసుకుందని ట్వీట్ చేశారు.
భర్తతో అమృతా రాయ్ విడాకులు తీసుకున్న తర్వాత తాము పెళ్లి చేసుకుంటామని చెప్పారు. అయితే, తమ వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూడడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. తన భర్తతో విడాకులు తీసుకుంటున్న విషయాన్ని అమృతా రాయ్ కూడా ధ్రువీకరించారు. ఆ తర్వాత తాము పెళ్లి చేసుకుంటామని చెప్పారు.


Click it and Unblock the Notifications











