ఆ విషయంలో కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి థ్యాంక్స్ చెప్పాలి.. ఎవడబ్బ సొమ్ము అంటూ రాంగోపాల్ వర్మ‌కు నెటిజన్ల షాక్

ఏపీ, తెలంగాణ రాజకీయాలపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ హాట్ హాట్‌గా చేస్తున్న ట్వీట్లు నెటిజన్లకు మంచి వినోదాన్ని ఇస్తున్నాయనడం ఎలాంటి సందేహం లేదు. ఇప్పటి వరకు ఆంధ్రా రాజకీయాలకు పరిమితమైన వర్మ ట్వీట్లు తెలంగాణ అసెంబ్లీ తర్వాత తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ట్వీట్లతో హొరెత్తిస్తున్నాడు. తాజా ట్వీట్లు చూస్తే రేవంత్ రెడ్డికి అభిమానిగా మారిపోయాడా? అనేంతగా సందేహాలు రెక్కిస్తున్నాడు. తాజాగా కేసీఆర్, రేవంత్ రెడ్డి గురించి చేసిన ట్వీటు వైరల్ అయింది. ఆ ట్వీట్ వివరాల్లోకి వెళితే..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ట్వీట్ల వర్షం కురిపిస్తున్నాడు. రేవంత్ రెడ్డి సాధించిన విజయానికి ఫిదా అయిపోయిన ఆయన పగలు, రాత్రనకుండా తన అభిప్రాయాలను అభిమానులతో పంచుకొంటున్నారు. ట్వీట్లు చేస్తూ ఆశ్చర్యకరమైన అంశాలను ప్రస్తావిస్తున్నాడు.

RGV Tweet about KCR and Revanth Reddy Goes Viral, Netizens Reaction here

రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయాణం.. అతడు పీఠాన్ని జయించిన విధానంపై తనదైన రీతిలో ట్వీట్లు వేస్తూ ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగానే.. ప్రధాని మోదీ విషెస్‌ చేస్తూ ట్వీట్ చేశారు. ప్రధాని ట్వీట్‌కు స్పందిస్తూ.. తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని అంటూ రేవంత్ ట్వీట్ చేశాడు. అందుకు సింహాంలా బిహేవ్ చేశాడంటూ రాంగోపాల్ వర్మ కామెంట్ చేశాడు.

తాజాగా రాంగోపాల్ వర్మ ఆసక్తికరమైన ట్వీట్‌తో తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచాడు. కేసీఆర్‌కు నిజంగా సీఎం రేవంత్ రెడ్డి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే బ్రాండ్ న్యూ సెక్రటేరియట్‌ను కట్టించి బహుమతిగా ఇచ్చాడు కాబట్టి అని రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశాడు.

RGV Tweet about KCR and Revanth Reddy Goes Viral, Netizens Reaction here

ఆర్జీవి చేసిన ట్వీట్‌కు నెటిజన్లు భారీగా స్పందిస్తున్నారు. మీరు చెప్పింది అక్షర సత్యం అంటూ కామెంట్ చేశారు. మరికొందరు మాత్రం.. ఎవరి సొమ్ము.. ఎవరు ఇచ్చారు? ఎవరు మాట్లాడుతున్నారు? అదంతా ప్రజల సొమ్ము.. ఒకరికి బహుమతి ఇవ్వడానికి వాళ్లేవరు అంటూ ఘాటుగా స్పందించారు. ప్రజల సొమ్ముతో కట్టిన భవనం.. అందుకు కేసీఆర్‌కు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X