రియల్ మెగా పవర్ స్టార్ ఆయనే, ఆయన పార్టీలో చేరుతా : వర్మ
హైదరాబాద్ : తన వ్యాఖ్యలతో ఎప్పుడూ ఏదో ఒక సంచలనం క్రియేట్ చేసే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆయన తాజాగా మరో వ్యాఖ్య చేసి అందరి దృష్టి తన వైపుకు తిప్పుకున్నాడు. తాను రాజకీయాల్లోకి వస్తానంటూ.. రియల్ మెగా పవర్ స్టార్ ఆయనే అంటూ ట్వీట్ చేసారు. ఇంతకీ ఆయనేం ట్వీట్ చేసారు...ఇక్కడ చూడండి.
అలాగే... స్క్రీన్ మెగా పవర్ స్టార్స్ ఫేక్ స్టార్స్ మాత్రమే అని కామెంట్ చేశాడు. తాను రాజకీయాలు, ప్రజా సంక్షేమంపై నమ్మకం లేదని... ఒకవేళ ముద్రగడ పార్టీ పెడితే ఆ పార్టీలో చేరతానన్నాడు.
తాను కాపు వర్గానికి చెందిన వాడిని కాదని... తన మిత్రులు ఎక్కువ మంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారని చెప్పుకొచ్చాడు.

వంగవీటి సినిమా తీయడానికి ఆ కథకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకునేందుకు వర్మ శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు విజయవాడలో పర్యటిస్తున్నాడు.
అంతకు ముందు మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ (నెహ్రూ), ప్రముఖ న్యాయవాది కర్నాటి రామ్మోహన్ సహా పలువురిని కలుస్తానని చెప్పాడు.
జూన్ మొదటి వారంలో సినిమా విడుదల చేస్తామంటున్నాడు. రాజకీయాల్లోకి వస్తానంటూ వర్మ తాజాగా చేసిన వ్యాఖ్యలు వంగవీటి సినిమా ప్రమోషన్ లో భాగంగానే చేసినట్లుగా అర్దమవుతోంది.


Click it and Unblock the Notifications











