పవన్ కళ్యాణ్‌ను పొగుడుతూ...చిరంజీవిపై సెటైర్లు!
హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్, చిరంజీవి గురించి ట్విట్టర్లో కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. తమ్ముడు పవన్ కళ్యాణ్‌ను పొగుడుతూ అన్నయ్య చిరంజీవికి డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా సెటైర్లు వేస్తూ వస్తున్నారు. తాజాగా వర్మ తన ట్విట్టర్లో మరో ట్వీట్ చేసారు.
'పవన్ కళ్యాణ్‌ను ఉన్నత స్థాయిలో చూస్తుంటే నాకు ఎంతో సంతోసంగా ఉంది. ఈ సందర్బంగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. అతను ఎప్పటికీ బెస్ట్. అన్నయ్య కంటే బెటర్. ఆయన చేయనిది పవన్ చేసాడు' అంటూ తన మనసులోని మాట బయటపెట్టారు రామ్ గోపాల్ వర్మ. పవన్ కళ్యాణ్‌కు ఎన్డీఏ నుండి ప్రత్యేక ఆహ్వానం అందడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

చిరంజీవిపై మాత్రమే కాదు...ఇటీవల ఎన్నికల ఫలితాల అనంతరం జగన్, సోనియా, రాహుల్ గాంధీలపై కూడా వర్మ సెటైర్లు విసిరాడు. ఇన్నాళ్లు ఓదార్పు యాత్ర చేసిన జగన్ పరిస్థితి తారుమారైంది. ఇపుడు అతనికి రివర్స్ ఓదార్పు మొదలయ్యే సమయం వచ్చింది అంటూ రామ్ గోపాల్ వర్మ నిన్న తన ఫేస్ బుక్‌లో ఆసక్తికర ఫోటో పోస్టు చేసిన సంగతి తెలిసిందే.
గాంధీ కుటుంబంపై వ్యాఖ్యలు చేస్తూ....."సంతాపం...గాంధీ డెస్టనీ (వంశం)పరంపర 1947లో నెహ్రూతో పుట్టి....2014లో రాహుల్ రూపంలో అంతమైంది' అంటూ వర్మ ఫేస్ బుక్‌లో కామెంట్ చేసారు. అంతే కాకుండా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, శీలా దీక్షిత్, మన్మోహన్ సింగ్, చిదంబరం మూట ముళ్లె సర్దుకుని వెలుతున్నట్లు ఉన్న ఫోటో పోస్టు చేసారు.


Click it and Unblock the Notifications











