పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం, రామ్ గోపాల్ వర్మ వివరణ!
హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల శంకర్ ‘ఐ' ట్రైలర్ విడుదల తర్వాత పొగడ్తలు గుప్పిస్తూ ట్విట్టర్ ద్వారా కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. ఆయన చేసిన కామెంట్లలో కొన్ని పవన్ అభిమానులకు కోపం తెప్పించాయి. ‘ఐ సినిమా రిలీజ్ తర్వాత సంక్రాంతి కాస్త శంకర్ రాత్రి అవుతుంది. శంకర్ గురించి తెలియని డమ్ పీపుల్ మాత్రమే సినిమాలు విడుదల చేస్తారు. మరి పికె సంగతి ఏమవుతుందో? అంటూ ట్వీట్ చేసాడు.
అయితే వర్మ ‘పికె' ప్రస్తావన తేవడం పవన్ కళ్యాణ్ అభిమానులకు కోపం తెప్పించింది. పవన్ కళ్యాణ్‌ను షార్ట్ కట్‌గా పికె అని పిలుస్తుంటారు. వర్మ కూడా గతంలో ఆయన్ను తన ట్విట్టర్లో అలానే సంబోధించేవాడు. ఈ నేపథ్యంలో వర్మపై పవన్ అభిమానులు ఆగ్రహం వెల్లగక్కారు.

దీంతో వెంటనే స్పందించిన రామ్ గోపాల్ వర్మ.....పికె అంటే పవన్ కళ్యాణ్ అని అంతా నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను మాట్లాడింది అమీర్ ఖాన్ పికె చిత్రం గురించి. శంకర్ ఐ సినిమా విడుదలైతే పికె సినిమా ఆడటం కష్టం అనేది నా మాటల్లోని అంతరార్థం అని వర్మ చెప్పుకొచ్చారు.
పవన్ కళ్యాణ్ నటించిన ‘గోపాల గోపాల' చిత్రం సంక్రాంతికి విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు పవన్ అభిమానులకు చిరాకు తెప్పించాయి. వర్మ వివరణ ఇవ్వడంతో అభిమానులు కాస్త శాంతించారు.


Click it and Unblock the Notifications











