»   » రావణుడు, సీతపై వర్మ వివాదాస్పద ట్వీట్

రావణుడు, సీతపై వర్మ వివాదాస్పద ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎప్పుడూ ఎవరో ఒకర్ని గెలకడం, వివాదాలు క్రియేట్ చేయడం దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు కొత్తమే కాదు. దీంతో పాటు దేవతల మీద, కొన్ని పండగల మీద అనవసర కామెంట్లు చేసి నానా కాంట్రవర్సీలు సృష్టించిన ఘనత కూడా ఉంది రామూజీకి. తాజాగా వర్మ రావణుడు, సీత మీద వివాదాస్పద కామెంట్లు చేసాడు.

దీని గురించి వర్మ తన ట్విట్టర్లో స్పందిస్తూ...రామాయణంలో రావణాసురుడు సీతను ఎత్తుకెళ్లడం తప్పా? అంటూ ప్రశ్నించాడు. సీతను కిడ్నాప్ చేసిన రావణుడు ఆమెను ఏమీ చేయలేదని... హిట్లర్, ఒసామా బిన్ లాడెన్ లా విలన్‌లాగా రావణాసురుడు ఎప్పుడూ ప్రవర్తించలేదని వ్యాఖ్యానించాడు.

RGV tweet about Ravana

తాను చదివిన పురాణ పుస్తకాల్లో రాక్షసులు ఎవరూ రాక్షసుల్లాగా ప్రవర్తించలేదని అన్నాడు. రచయితలు రాక్షసుల క్యారెక్టర్లను సరిగా డెవలప్ చేయలేదని చెప్పాడు. సీతను అపహరించడం తప్పయితే. భారత్‌లో ప్రతినెలా 100 మంది విలన్‌లను మనం చూడొచ్చని వర్మ ట్వీట్ చేశాడు.

English summary
"I know that Ravana was a villain but I never heard a single act of villainy of his like I heard of Hitler,Osama bin laden etc" RGV tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu