»   » తిట్టించొద్దు సార్... అంటూ రాజమౌళి రిక్వెస్ట్

తిట్టించొద్దు సార్... అంటూ రాజమౌళి రిక్వెస్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్లో ఎప్పుడూ ఏదో ఒక కామెంట్స్ చేస్తూ విమర్శలు చేయడం, లేదా తన ట్వీట్ల ద్వారా అందరినీ ఇరుకున పెట్టడం లాంటి చేస్తుంటాడు. తాజాగా దర్శకుడు రాజమౌళిని ఇరుకున పెట్టే ప్రయత్నం చేసారు వర్మ. రాజమౌళి ఇంటి పేరులో ఎస్ఎస్ అంటే... స్టీవెన్ స్పీల్ బర్గ్ అంటూ అంటూ కామెంట్ చేసారు.

Rajamouli - RGV

దీనికి వెంటనే స్పందించిన రాజమౌళి.... ‘జనంతో నన్ను తిట్టించడానికి కాకపోతే అవసరమా సార్ ఇపుడు ఇది ' అంటూ తనను ఇరికించొద్దు మహా ప్రభో అంటూ పరోక్షంగా వర్మను వేడుకున్నాడు రాజమౌళి.

ఇటీవల టీచర్స్ డే సందర్భంగా కూడా వర్మ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలే చేసాడు. నేను ఎప్పటికీ ‘హ్యాపీ టీచర్స్ డే' అని చెప్పను, ఎందుకంటే నేను నా టీచర్ల వల్ల ఒక్కరోజు కూడా ఆనందంగా లేను అని వ్యాఖ్యానించారు. కరణ్ జోహార్ సినిమా ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' మాదిరిగా ఎవరైనా ‘టీచర్ ఆఫ్ ది ఇయర్' అనే సినిమా తీస్తే ఆ సినిమా పెద్ద డిజాస్టర్ ఆప్ ది ఇయర్ అవుతుంది అంటూ ట్విట్టర్ ద్వారా కామెంట్ చేసాడు.

English summary
"I just now came to know that the SS in SS Rajamouli stands for Steven Spielberg" RGV tweeted.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu