కేసీఆర్‌పై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు

వర్మ తన ట్విట్టర్లో స్పందిస్తూ...'యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఏ రాష్ట్రం కూడా ఇప్పటి వరకు విభజన కోరుకోక పోవడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది. కానీ ఇండియాలో మాత్రం అలా కాదు. ఇండియన్స్‌కు అలా ఉండటం సాధ్యం కావడం లేదా? రాష్ట్రాలు యునైటెడ్‌గాగా ఎలా ఉండాలో యునైటెడ్ స్టేట్స్ నుంచి మనం నేర్చుకోవాల్సి ఉంది. ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్‌లా యునైటెడ్‌గా ఎలా ఉండాలో మనకు తెలియదు. కాబట్టి ఇండియన్ ఓటర్స్ అమెరికా ఓటర్ల నుంచి నేర్చుకోవాలి లేదా ఇండియన్ పొలిటీషియన్స్ అమెరికన్ పొలిటీషియన్స్ నుంచి నేర్చుకోవాలి' అంటూ రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు.
'అమెరికాలో ఒక్క రాష్ట్రం కూడా విభజన కోరుకోవడం లేదు..ఎందుకంటే అక్కడ కేసీఆర్ లాంటి సమర్ధులైన లీడర్స్ లేరు. ఒక వేళ కేసీఆర్ అమెరికాలో పుట్టి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో చూడాలని ఉంది. ' అంటూ వర్మ సంచలన కామెంట్ చేసారు. రాష్ట్ర విభజన ఎందుకు చేస్తున్నారో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు అంటూ వర్మ వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications











