twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఉండవల్లి స్పీచ్‌పై రామ్ గోపాల్ వర్మ ట్వీట్

    By Bojja Kumar
    |

    RGV
    హైదరాబాద్ : రాష్ట్రంలో తెలంగాణ విభజన నిర్ణయం ఖాయం అయిన నేపథ్యంలో ఉవ్వెత్తున ఎగిసిన సమైక్య ఉద్యమం సీమాంధ్ర ప్రాంతంలో ఉధృతంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ ద్వారా ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు.

    రాష్ట్ర విభజన నిర్ణయం తర్వాత రామ్ గోపాల్ వర్మ చాలా అప్‌సెట్ అయినట్లు ఆయన ట్విట్స్ పరిశీలిస్తే స్పష్టం అవుతోంది. తెలంగాణ విషయంలో ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రసంగం చాలా బాగుందని, దాన్ని అంతా చూడాలని అంటున్నారు ఈ వివాదాస్పద దర్శకుడు.

    "తెలుగు వాళ్లను విభజించడానికి ఓ ఇటాలియన్, ఓ కన్నడిగ, ఓ తమిళియన్, ఓ బిహారీ, ఓ హిందీ చేతులు కలిపారు'' అని రామ్‌గోపాల్‌వర్మ అన్నారు. తెలంగాణ విషయమై కాంగ్రెస్ తన వైఖరిని ప్రకటించిన విషయం విదితమే. దీనికి సంబంధించి రామ్‌గోపాల్‌వర్మ ట్వీట్ చేశారు.

    "సాంకేతికపరమైన అంశాల జోలికి నేను వెళ్లడం లేదు. కానీ తెలుగు వాళ్లను విడగొట్టడానికి ఓ ఇటాలియన్, ఓ కన్నడిగ, ఓ తమిళియన్, ఓ బీహారి, ఓ హిందీ చేతులు కలపడమే బాధాకరంగా ఉంది'' అని వర్మ ట్విట్టర్‌లో రాసుకున్నారు. మరి ఈ వ్యాఖ్యల నేపథ్యంలో వర్మ భవిష్యత్‍‌లో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారో చూడాలి.

    English summary
    "Vundavalli's speech in Rajmundry on Telangana is extremley enlightening..fr any1 who seriously wants to knw about the issue its a must watch" Ram Gopal Varma tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X