ఉమెన్స్ డే: చావగొట్టండంటూ వర్మ ట్వీట్
హైదరాబాద్: ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద ట్వీట్ చేస్తూ బిజీగా ఉండే రామ్ గోపాల్ వర్మ... ఉమెన్స్ డే సందర్బంగా ఓ ట్వీట్ చేసారు. గతంలో ఆయన ట్వీట్స్‌పై మహిళల అభిప్రాయం ఏమిటో తెలియదు కానీ, ఈ రోజు వర్మ చేసిన ట్వీట్ పై మాత్రం మహిళ నుండి ప్రశంసలు వెల్లువెత్తున్నాయి.
నిర్భయపై అత్యాచారం చేసిన పాపాత్ముల తరుపున వాదిస్తున్న లాయర్ ఎంఎల్ శర్మ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాత్రి 9 తర్వాత మహిళలు బయకు వెళితే వారిపై అత్యాచారాలు జరుగడం సహజమే. రాత్రి పూట ఆమె(నిర్భయ) బయటకు వెళ్లడమే పెద్ద తప్పు అంటూ...బిబిసి జర్నలిస్టు లెస్లీ ఉడ్విన్ రూపొందించిన డాక్యుమెంటరీలో వ్యాఖ్యానించారు.

దీనిపై రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ....‘ఈ ఉమెన్స్ డే సందర్భంగా మహిళలంతా కలిసి ఎంఎల్ శర్మ మరియు అతని లాంటి వారి ఇళ్లకు వెళ్లి చావగొట్టాలని కోరుకుంటున్నాను' అంటూ ట్వీట్ చేసారు. దీంతో మహిళలకు పురుషులతో సమానంగా జీవితం హక్కు ఉంది అంటూ వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications











