చిరంజీవిని సీఎం చేసిన రామ్ గోపాల్ వర్మ
అందరు లీడర్స్ జైల్ కి వెళ్ళి పోయారు..చిరంజీవి గారు ఒక్కరే మిగిలిపోయి సి ఎం అయిపోయినట్లు నాకు నిన్న రాత్రి కల వచ్చింది అంటూ రామ్ గోపాల్ వర్మ తాజాజా ఓ ట్వీట్ చేసారు. ఆ ట్వీట్ సంగతి తెలుసుకున్న చిరంజీవి చాలా హ్యాపీ ఫీలైనట్లు తెలుస్తోంది. అయితే ఆయన వ్యగ్యంగా చిరంజీవి అన్నా సీఎం అవుతారనే మాట చిరుకు చాలా ఆనందాన్ని ఇచ్చినట్లు చెప్తున్నారు. ఇక గతంలోనూ రామ్ గోపాల్ వర్మ చిరంజీవిని ఉద్దేశించి చాలా ట్వీట్స్ చేసారు. ఆ మధ్యన చిరంజీవి సినిమాని డైరక్ట్ చేయాలని ఉందని,దాని పేరు దొర..ది లార్డ్ అని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేసారు. ఆ తర్వాత చిరంజీవి చాలా స్లిమ్ గా తయారయ్యారని, పవన్, రామ్ చరణ్ ల కన్నా చాలా అందంగా ఉన్నారని కామెంట్ చేసారు.
అనంతరం చిరంజీవి తన 150 చిత్రాన్ని తానే డైరక్ట్ చేసుకుంటే చూడాలని ఉందని అన్నారు. ఇంకెవరూ డైరక్ట్ చేసినా అంతబాగా ఉండరని కామెంట్ చేసారు. వీటితో పాటు రామ్ చరణ్ ఆరెంజ్ పైన కూడా ఆయన కొన్ని ట్వీట్స్ చేసి అందరిలో ఆసక్తి క్రియోట్ చేసారు. తాజాగా మరోసారి చిరంజీవిని ఉద్దేశిస్తూ ఆయన ట్వీట్ చేసారు. ఆయన ట్వీట్ చేసిన దాంట్లో...చిరంజీవి గారు ఈజ్ ఆంధ్రప్రదేశ్ స్ అదృష్ఠం అండ్ ఆంద్రప్రదేశ్ ఈజ్ చిరంజీవిగారూస్ అదృష్టం అన్నారు. ఆయన అలా ఎందుకన్నారనేదాని పెద్ద రీజన్ ఉండకపోవచ్చు కానీ చిరంజీవి మరో సారి కామెంట్ చేయాలనే ఉద్దేశ్యంతోనే అన్నట్లు అర్దమవుతుంది.


Click it and Unblock the Notifications











