'గబ్బర్ సింగ్'తో నాకు అర్దమైంది: వర్మ
రామ్ గోపాల్ వర్మ తాజాగా రిలీజైన గబ్బర్ సింగ్ చిత్రంపై విడుదలైన నాటి నుంచి ట్విట్టర్ లో తన అభినందనలు, ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నాడు. తాజాగా ఆయన ట్వీట్ చేస్తూ...గబ్బర్ సింగ్ తో నాకు అర్దమైంది...రంగీలా తీసినప్పుడు ఊర్మిళతో నేనేంత లవ్ లో ఉన్నానో..కళ్యాణ్ తో హరీష్ అంతకన్నా ఎక్కవ లవ్ లో ఉన్నాడని. వర్మ సరదాగా రాసిన ఈ ట్విట్..పవన్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. హరీష్ శంకర్ సైతం ఈ ట్వీట్ కి చాలా ఆనందపడ్డారు.
ఇక వర్మ తాజా చిత్రం డిపార్టమెంట్ భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. విమర్శులంతా విరుచుకుపడ్డారు. వర్మ అభిమానులు సైతం ఇంత చెత్త చిత్రం చూడలేదంటూ సినిమాను విమర్శించారు. ఈ విషయమై వర్మ మాట్లాడుతూ...నేను కొంత కాలం నుంచి జనాల అంచనాలకు,కామెంట్స్ కు స్పందించటం మానేసాను. ఇది ప్రీ కంట్రీ. ఇక్కడ ఎవరైనా,ఎప్పుడైనా,ఎలాంటి అభిప్రాయాన్నైనా చెప్పవచ్చు. నేను సినిమాల్లో ఉన్నాను..వాటిని కంటిన్యూ చేయటమే నా పని అన్నారు.
డిపార్టమెంట్ చిత్రంలో తను పెట్టిన కెమెరా యాంగిల్స్ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయంటూ విమర్శలు వస్తున్న నేపధ్యంలో ఆయన మాట్లాడుతూ...ఆ యాంగిల్స్ ..అలా తీయటం నేను విప్లవాత్మకంగా భావిస్తున్నాను. అంతేకాని కాస్ట్ కట్టింగ్ కోసం తీసింది కాదు. నేను ఈ టెక్నిక్ ని వాడింది..ఇప్పటివరకూ ప్రేక్షకులు తెరపై చూడంది..చూపించి వారిని ఓ ప్రత్యేకమైన అనుభూతికి లోను చేయాలని. అందుకే నేను తీసాను అన్నారు.
వర్మ డిపార్టమెంట్ చిత్రంలో రానా ప్రధాన పాత్ర చేసారు. వరస ప్లాప్ ల్లో ఉన్న రానాకి మరో పెద్ద ప్లాప్ దొరికినట్లైంది. సంజయ్ దత్,అమితాబ్ వంటి స్టార్స్ ఉన్నా ఈ చిత్రానికి హైప్ క్రియేట్ కాలేదు. తెలుగు నుంచి మంచు లక్షి సైతం ఈ చిత్రంలో ఓ కీ రోల్ చేసింది. ఆమె ఈ చిత్రం విడుదలకు ముందు తన పాత్ర చాలా హైలెట్ గా ఉంటుందని చాలా చెప్పుకొచ్చింది. కానీ సినిమాలో ఆ పాత్రకు ఇంపార్టెన్స్ లేకుండా పోయింది. వర్మ తన దృష్టిని మొత్తం ఐటం సాంగ్ చేసిన నధాలియాపై పెట్టారని,అయితే ఆ పాట కూడా తెరపై కిక్ ఇవ్వలేకపోయిందని తీవ్ర విమర్శలు వచ్చాయి.


Click it and Unblock the Notifications











