Just In
- 1 hr ago
హాలీవుడ్ చిత్రం గాడ్జిల్లా vs కాంగ్ ట్రైలర్ విడుదల: తెలుగుతో పాటు ఆ భాషల్లో కూడా వదిలారు
- 2 hrs ago
మహేశ్ బాబు పేరిట ప్రపంచ రికార్డు: సినిమాకు ముందే సంచలనం.. చలనచిత్ర చరిత్రలోనే తొలిసారి ఇలా!
- 3 hrs ago
ఘనంగా హీరో వరుణ్ వివాహం: సీసీ కెమెరాలు తీసేసి మరీ రహస్యంగా.. ఆయన మాత్రమే వచ్చాడు!
- 4 hrs ago
శ్రీరాముడిపై మోనాల్ గజ్జర్ అనుచిత వ్యాఖ్యలు: అందుకే అలాంటోడిని చేసుకోనంటూ షాకింగ్‌గా!
Don't Miss!
- Sports
మెల్బోర్న్ సెంచరీ చాలా స్పెషల్.. అందుకే సిడ్నీలో మైదానం వీడలేదు: అజింక్యా రహానే
- News
నేరం మీది కాదు..ఆ అదృశ్య వ్యక్తిది: ఎన్టీఆర్ సినిమా చూపిస్తున్నారు: నిమ్మగడ్డకు ముద్రగడ..ఘాటుగా
- Automobiles
కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ఎప్పుడు? ఇందులో కొత్తగా ఏయే ఫీచర్లు ఉండొచ్చు?
- Lifestyle
జుట్టు పెరగడానికి నూనె మాత్రమే సరిపోదు, ఇక్కడ మోకాలి పొడవు జుట్టు యొక్క రహస్యం ఉంది
- Finance
Budget 2021: హెల్త్ బడ్జెట్ డబుల్! నిర్మలమ్మ 'ప్రధానమంత్రి హెల్త్‌ఫండ్?'
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
లక్ష్మీస్ ఎన్టీఆర్ సంచలనం.. 10 నిమిషాల్లో 1000 టికెట్ల అమ్మకం.. అడ్వాన్స్ బుకింగ్.. వర్మ
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం రిలీజ్‌కు ముందే పలు వివాదాలకు కారణమైంది. సినిమాను నిలిపివేయాలని తెలుగుదేశం పార్టీ నేతలు కోర్టులో ఫిర్యాదు చేశారు. ఎన్నికల నేపథ్యంలో సినిమా రిలీజ్‌ను ఆపేయాలని డిమాండ్లు వినిపించాయి. ఇలాంటి అవరోధాలను అధిగమించి లక్ష్మీస్ ఎన్టీఆర్ మార్చి 29న రిలీజ్‌కు సిద్దమైంది. మంగళవారం ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ సెన్సేషనల్‌గా ప్రారంభమైందని ఆర్జీవి ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే..

లక్ష్మీస్ ఎన్టీఆర్ క్రేజ్ అంటే ఇది
సూపర్‌స్టార్ మహేష్ బాబు మల్టిప్లెక్స్ ఏఎంబీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌కు మంచి స్పందన వస్తున్నది. అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైన 10 నిమిషాల్లోనే 1000 టికెట్లు అమ్ముడుపోయాయి. లక్ష్మీస్ ఎన్టీఆర్ క్రేజ్ ఏంటో దీనిని బట్టి చెప్పవచ్చు అని రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశాడు.
— Ram Gopal Varma (@RGVzoomin) March 26, 2019 |
నకిలీ ఫ్యాన్స్ కాదు.. నిజమైన ఫ్యాన్స్
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు సంబంధించిన 1000 టికెట్లను కేవలం 10 నిమిషాల్లో కొనుక్కొన్న వారు స్వర్గీయ ఎన్టీఆర్‌కు నిజమైన అభిమానులు. వారు మహానటుడికి నకిలీ ఫ్యాన్స్ ముమ్మాటికి కాదు అని ఆర్జీవి ట్వీట్ చేశారు.

లక్ష్మీస్ ఎన్టీఆర్‌కు యూ సర్టిఫికెట్
లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ సర్టిఫికెట్ ఇవ్వడం సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. క్లీన్ చిట్‌గా యూ సర్టిఫికెట్ ఇవ్వంపై ఆర్జీవి స్పందించారు. చంద్రబాబు గురించిన నిజం గెలిచింది. సెన్సార్ బోర్డు నిష్ఫక్షపాతంగా వ్యవహరించింది. విశ్వం ఆమోదించే విధంగా యూ సర్టిఫికెట్ లభించింది అని ఆర్జీవి ట్వీట్ చేశారు.

నటీనటులు, సాంకేతిక నిపుణులు
లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో స్వర్గీయ ఎన్టీఆర్ పాత్రలో రంగస్థల నటుడు విజయ్ కుమార్, లక్ష్మీపార్వతి పాత్రలో కన్నడ నటి యజ్ఞాశెట్టి, చంద్రబాబు పాత్రలో శ్రీతేజ్ నటించారు. రామ్ గోపాల్ వర్మ, ఆగస్త్య మంజు దర్శకత్వం వహించారు. నిర్మాత రాకేశ్ రెడ్డి, దీప్తి బాలగిరి ఈ చిత్రాన్ని నిర్మించారు.