»   » ఆ వ్యక్తిని 1000 తన్నులు తన్నండి‌: వర్మ

ఆ వ్యక్తిని 1000 తన్నులు తన్నండి‌: వర్మ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా, ట్విట్టర్ లో ఏం రాసినా సంచలనమే. గత రెండు మూడు రోజులుగా ఆయన రజనీకాంత్ ని టార్గెట్ చేస్తూ వరస ట్వీట్స్ చేస్తున్నారు. ఆయన ట్వీట్స్ రజనీ అభిమానులకు కోపం తెప్పింస్తున్నారు. అయితే తాజాగా ఆయన చేసిన ట్వీట్ రజనీని పొగడుతూ చేసారు.

సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ 100 ముద్దులకు అర్హుడని రామ్‌గోపాల్‌వర్మ అన్నారు. ఇటీవల విడుదలైన రజినీకాంత్‌ 'కబాలి' చిత్రంలోని నిరుప్పు డా.. పాట టీజర్‌ను చూసిన వర్మ ట్విట్టర్‌ ద్వారా స్పందించారు.
'రజినీకాంత్‌ సార్‌ 100 ముద్దులకు అర్హుడు, ఆయనకు నా విన్నపం ఏమిటంటే.. సబ్‌టైటిలింగ్‌ వ్యక్తిని 1000 తన్నులు తన్నండి' అని ట్వీట్‌ చేశారు. దీంతోపాటు పాట టీజర్‌ను లింక్‌ను పోస్ట్‌ చేశారు.


varma-rajini

నిరుప్పు డా.. టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. గురువారం రాత్రి యూట్యూబ్‌లో విడుదలైన ఈ టీజర్‌ను ఇప్పటి వరకు దాదాపు 30 లక్షల మంది చూశారు. ఏప్రిల్‌ 30న విడుదలైన ఈ చిత్రం టీజర్‌ అత్యధిక హిట్స్‌తో రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.
అలాగే...తీన్ లాంటి సినిమా రజనీ చేస్తే ఎవరూ చూడరు..... అదే రోబో లాంటి సినిమా అమితాబ్ చేస్తే ఇంకా పెద్ద విజయం సాధించేది అని వర్మ కామెంట్ చేసారు.


రెండు రోజుల క్రితం ...అమితాబ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'తీన్' సినిమా చూసిన రామ్ గోపాల్ వర్మ తనదైన రీతిలో స్పందించారు. అమితాబ్ హీరోయిక్ పాత్రలకు అదే సమయంలో ప్రయోగాత్మక పాత్రలకు బాగా సూటవుతారని కితాబిచ్చారు.


తెలుగులో చిరంజీవి, తమిళంలో రజనీకాంత్ లాంటి స్టార్స్ ఇలా చేయలేరని అభిప్రాయ పడ్డారు. అమితాబ్ సినీ రంగ అభివృద్ధి కోసం తన ఇమేజ్ ను పక్కన పెట్టి సినిమాలు చేస్తున్నారంటూ పొగడ్తలు గుప్పించారు.


English summary
Ram Gopal Varma tweeted:Rajnikanth sir deserves 100 kisses and my tequest to him is to give 1000 kicks to the subtitling guy."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu