twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ ని అడ్డం పెట్టుకుని చిరుని గిల్లుతున్నారా

    By Srikanya
    |

    "ఈ రోజు నేను విన్న మహా అద్భుతమైన న్యూస్ మహేశ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో చిరంజీవి 'ఖైదీ'ని రీమేక్ చేస్తారని. జగన్ చెప్పిన మహేశ్ కేరక్టరైజేషన్‌తో కంపేర్ చేస్తే కోదండరామిరెడ్డి (చూపించిన) చిరంజీవి కేరక్టరైజేషన్ నథింగ్'' అని ఆయన చెప్పారు. ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుపుకుంటున్న 'బిజినెస్‌మేన్' సెట్స్‌కి వెళ్లిన ఆయన "ఇప్పుడే పూరి జగన్, మహేశ్ 'బిజినెస్‌మేన్'లో కొన్ని సీన్లు చూశాను. ఇది 'దూకుడు' కాదు, జంపుడు కాదు. ఇది డబుల్ జంపుడు'' అని ట్విట్టర్‌లో రాశారు. ఇంతకుముందు పూరీ దర్శకత్వంలో మహేష్ హీరోగా ఖైదీ రీమేక్ చేస్తారని వార్తలు వచ్చాయి. వాటిని వర్మ కన్ఫర్మ్ చేస్తున్నట్లా..లేక చిరంజీవిని కావాలని మళ్లీ ఆయన గిల్లుతున్నాడా అని ఫిల్మ్ సర్కిల్స్ లో సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మెసేజ్ తో వర్మ కావాలనే చిరంజీవిని మరో సారి టార్గెట్ చేస్తున్నాడని చిరు అభిమానులు అంటున్నారు. గతంలో కూడా రామ్ గోపాల్ వర్మ .. రామ్ గోపాల్ వర్మ కంటిన్యూగా చిరంజీవిపై ట్విట్టర్ బాణాలు వేస్తూనే ఉన్నారు.తాజాగా ఆయన చిరంజీవి కాంగ్రేస్ లో చేరటాన్ని ఉద్దేశ్శించి...కాంగ్రేస్ హీరో, చిరంజీవి హీరోయిన్, కానీ నేను ఎప్పుడూ ఏ హీరోని లెక్కచెయ్యలేదు. కేవలం హీరోయిన్ కోసమే ఏ సినిమా అయినా చూస్తుంటాను అని రాసారు. చిరంజీవి అభిమానులుకు భాధ కలిగించేలా ఉన్నా కాంగ్రేస్ కన్నా చిరంజీవికే ప్రయారిటీ ఇస్తున్నట్లు తెలివిగా ఆయన ట్వీట్ చేయటంతో ఎవరూ తిరిగి కామెంట్ చేయటం లేదు.

    ఇక ఆయన త్వరలో రూపొందించబోయే కుర్చీ చిత్రంలోనూ చిరంజీవి రాజకీయ జీవితం ప్రస్ధావన ఉన్నట్లు అప్పట్లో వినపడింది. అలాగే చిరంజీవి తన 150 చిత్రానికి చిరంజీవే డైరక్ట్ చేసుకుంటే బావుంటుందని, ఆ సామర్ధం ఆయనకే ఉందని అన్నారు. అలాగే 149 సినిమాల అనుభవం ఉన్న చిరంజీవికే దర్శకత్వం గురించి తెలియకపోతే మరి ఎవరికి అంత అవగాహన ఉంటుందని ప్రశ్నించారు. అలాగే చాలా గ్యాప్ తర్వాత చేసే ఈ చిత్రానికి వేరే డైరక్టర్ గాకుండా ఆయనే డైరక్షన్ చేసుకుంటే నేనే చుడ్డానికి మొదటి వరసలో ఉంటానన్నారు. ఇక ఆంధ్రా అంతా చిరంజీవి తనను తాను ఎలా డైరక్ట్ చేసుకుంటాడో చూడడానికి ఆత్రుతపడతారన్నారు.డైరక్టెడ్ బై చిరంజీవి అనే టైటిల్ కార్డుపడితే చూడాలని ఉంది అన్నారు. ఇక చిరంజీవిని కొంత మంది దర్సకులు ప్లాప్ చేసి ఉండవచ్చు. కానీ చిరంజీవి ఏ డైరక్టర్ నూ ప్లాప్ చేయలేదన్నారు. అదే ఆయన డైరక్టర్ కావటానికి అర్హత అని అన్నారు. సినిమా అనేది కనిపెట్టినప్పటి నుంచి తీసిన చిత్రాల్లో నేను ఎక్కువ ఎదురు చూసే చిత్రం చిరంజీవి డైరక్ట్ చేసేదే అవుతుంది. అలాగే ఓ చిరంజీవి ప్యాన్ గా, ఆంద్రప్రదేశ్ సిటిజెన్ గా చిరంజీవి 150వ చిత్రం ఎవరు డైరక్ట్ చేసినా నాకు తృప్తి ఉండదు. కేవలం మెగాస్టారే తన చిత్రానికి డైరక్టర్ కావాలి అని రాసుకొచ్చారు.

    English summary
    RGV tweeted: "The one exciting news that I heard today is that Puri remaking Chiru's Khaidi with Mahesh Babu. Jagan's design of Mahesh's characterization is much better than what Kondandarami Reddy did with Chiru in Khaidi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X