Don't Miss!
- Automobiles ఆటోమేటిక్ గేర్ vs మాన్యువల్ ట్రాన్స్మిషన్.. వీటిలో ఏది బెస్ట్.?.. మనోళ్లు ఎక్కువగా వీటినే కొంటున్నారు.!!
- News ప్రధాని మోదీ ఎదుటే కాలు మీద కాలు వేసుకుని కూర్చొన్న టీడీపీ ఎమ్మెల్యే.. తరువాత రియాక్షన్ ఏమిటంటే..?
- Sports IPL 2024 సీజన్లో చెలరేగేది ఆ కుర్రాడే: సునీల్ గవాస్కర్
- Technology సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హై రిస్క్ అలెర్ట్.. ఈ ఫోన్లలో భద్రతా లోపాలు.. అప్డేట్ చేయకుంటే..??
- Travel దేశంలో ఒక్కోచోట ఒక్కోలా రంగుల హోలీ జరుపుతారని మీకు తెలుసా?!
- Lifestyle శరీరంలో ఈ భాగాల్లో వాపు కనబడుతుంటే, పక్కా మీ లివర్ డ్యామేజ్ అయ్యిందని అర్థం..!హెచ్చరిక
- Finance Market Crash: సెన్సెక్స్-నిఫ్టీ నేల చూపులు.. నిండా ముంచిన ఐటీ స్టాక్స్..
ప్రభాస్ నా క్యాస్ట్: ‘సాహో’ రిలీజ్ వేళ కులం కుంపటి రగిల్చి సంచలనం!
Recommended Video
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం 'సాహో'. దాదాపు రూ. 350 కోట్ల బడ్జెట్తో యువి క్రియేషన్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్టు 30న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, మలయాళంలో విడుదల కాబోతోంది.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యాస్ట్ వైజ్ ఈక్వెషన్సే ఎక్కువగా ఉంటాయనే వాదన ఎప్పటి నుంచో ఉంది. అభిమానులు కూడా అదే ప్రాతిపాదికన తమ హీరోలను ఫాలో అవుతారు అనే ఒక అపవాదు కూడా ఉంది. అయితే ఇప్పుడిప్పుడే ఇలాంటి పరిస్థితుల్లో మార్పు వస్తున్న తరుణంలో, అది కూడా సాహో లాంటి పెద్ద సినిమా రిలీజ్ వేళ కులం బాంబు పేల్చాడు రామ్ గోపాల్ వర్మ.
ప్రభాస్ నా క్యాస్ట్
నాకు చాలా క్యాస్ట్ ఫీలింగ్ ఉంది, అందుకే రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘సాహో' సినిమా కోసం కళ్లు వాచిపోయేలా ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే ప్రభాస్ నా క్యాస్ట్ కాబట్టి.... అంటూ రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్లో ఓ పోస్ట్ పెట్టారు. వర్మ చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కమ్మ రాజ్యంలో కడప రెడ్లు... క్యాస్ట్ ఫీలింగ్ ప్రోమో
‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అనే సినిమాకు సంబంధించి రామ్ గోపాల్ వర్మ ఓ సాంగ్ విడుదల చేయబోతున్నారు. క్యాస్ట్ ఫీలింగ్ నేపథ్యంలో ఈ పాట ఉంటుందట. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాలోని ఒక పాటని 27వ తారీఖు ఉదయం గం. 9.27 నిమిలకు బ్రహ్మ ముహూర్తంలో విడుదల చేయబోతున్నాం.' అని వర్మ ప్రకటించారు.
వర్మకు ఓ అభిమాని సూపర్ రిప్లై
ప్రభాస్ నా క్యాస్ట్ అంటూ వర్మ ప్రకటించడంపై ఓ అభిమాని ఆనందం వ్యక్తం చేస్తూ రిప్లై ఇచ్చారు. అతడు ఇచ్చిన రిప్లై.... ఆర్జీవీ తన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. అందులో రామ్ గోపాల్ వర్మ, ప్రభాస్, కృష్ణం రాజు, రవితేజ, సుధీర్ వర్మ, సునీల్, అజయ్ భూపతి లాంటి వారికి జై కొడుతూ కామెంట్స్ ఉండటం గమనార్హం.
‘సాహో'పై ఎలాంటి ప్రభావం
వర్మ చేసిన ఈ క్యాస్ట్ కామెంట్.... ‘సాహో' మూవీపై ఎలాంటి ప్రభావం చూపబోతోంది? అదినే హాట్ టాపిక్ అయింది. సాహో మూవీ విషయానికొస్తే.... ఈ చిత్రాన్ని రూ. 350 కోట్ల బడ్జెట్తో యూవి క్రియేషన్స్ వారు రూపొందించారు. ప్రభాస్, శ్రద్ధా కపూర్, జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, చుంకీ పాండే, ఎవలీన్ శర్మ, మందిరా బేడీ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ ఇండియన్ బిగ్గెస్ట్ యాక్షన్ స్పై థ్రిల్లర్ ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.