»   » చెన్నై: వందల కోట్లున్న స్టార్లు లక్షలు బిచ్చమేస్తున్నారు!

చెన్నై: వందల కోట్లున్న స్టార్లు లక్షలు బిచ్చమేస్తున్నారు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చెన్నై వరద బాదితుల కోసం పలువురు సౌత్ స్టార్లతో పాటు తెలుగు స్టార్లు సైతం విరాళాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఇచ్చిన వారిలో హయ్యెస్ట్ అల్లు అర్జున్ రూ. 25 లక్షలు ఇవ్వగా... రజనీకాంత్ 10 లక్షలు, మహేష్ బాబు 10 లక్షలు, ఎన్టీఆర్ 10 లక్షలు, కృష్ణం రాజు, ప్రభాస్ కలిపి 15 లక్షలు, రవితేజ, కళ్యాణ్ చెరో 5 లక్షలు ప్రటించారు.

అయితే ఈ విరాళాలపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విమర్శలకు దిగారు. కొందరు అసలు విరాళాలే ఇవ్వకుండా కేవలం ప్రార్థనలతో సరిపెట్టడంపై మండిపడ్డాడు. వందల వందల కోట్లున్న సూపర్ స్టార్లు వేల వేల కోట్లు నష్టపోయిన చెన్నైకి ఐదు, పది లక్షలు బిచ్చమెయ్యడం ఏమిటని విమర్శించారు. అయ్య బాబోయ్ సూపర్ స్టార్లు 10 లక్షలు, 5 లక్షలు ఇస్తే అంత డబ్బు ఏమి చేయాలో తెలియక చెన్నై ప్రజలు మూర్చపోతారు. ఇవ్వక పోవడం బెటర్. నా విషయానికొస్తే నేను ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా దానం చేయలేదు. నేను స్వార్థ పరుడిని. ఆ సెలబ్రిటీల మీదిరి టన్నుల కొద్ది ప్రేమ కురిపించడం, ప్రార్థనలు చేయడం నాకు చేతకాదు.

సెలబ్రిటీలు ప్రేమ, ప్రార్థనలు టన్నుల కొద్దీ కురిపిస్తున్నారు. డబ్బుల విషయానికొస్తే మాత్రం కొన్ని మాత్రం ఇస్తున్నారు. ఎందకంటే ప్రేమ, ప్రార్థలు ఉచితం కాబట్టి టన్నుల కొద్దీ ఇస్తున్నారు. నాకు మాత్రం ఒక్కటి విచిత్రంగా అనిపిస్తోంది. ఏదైనా చేయగల శక్తి ఉన్న రజనీకాంత్ వానలు ఆపడానికి ఏదైనా చేయడం లేదేమిటి? అంటూ ట్వీట్ చేసారు.

సెలబ్రిటీలతో పాటు దేవుడి మీద తన ప్రతాపం చూపించారు. వర్షాలు కురిసేది దేవుడివల్లే కాబట్టి.. ప్రతిఒక్కరూ ప్రార్థించడానికి బదులు దేవుడిని విమర్శించాలి. లేకపోతే చెన్నైవాసులందరూ పాపులని, అందుకే దేవుడు శిక్షించాడని చెప్పాలి. చెన్నై వాసులను చూసి చాలా బాధపడుతున్నాను, సోకాల్డ్ దేవుడి మీద, ఆయన సాగించిన ఉగ్రవాద విధ్వంసం మీద పిచ్చ కోపంగా ఉన్నాను. ఇకనైనా ప్రజలు వెన్నుపోటుదారుడైన దేవుడిని నమ్మి సమయం వృథా చేసుకోడానికి బదులు తమ మీద తాము నమ్మకం పెట్టుకోవాలన్నారు.

చెన్నైలో దేవుడు సృష్టించిన విధ్వంసం ముందు ప్రపంచంలో ఏ ఉగ్రవాద చర్య అయినా బలాదూరే. చెన్నై వాసుల కష్టాలు చూసి నా గుండె చెదిరిపోతోంది. అందుకే నేను రాయడానికి వీల్లేనంత దారుణమైన భాషలో దేవుడిని తిడుతున్నాను. దేవుడిని ప్రార్థించడం అంటే ఉగ్రవాదిని ప్రార్థించడం లాంటిదే అవుతుంది అన్నారు.

స్లైడ్ షోలో వర్మ ట్వీట్లు...

వందల కోట్లున్నా...బిచ్చం

వందల వందల కోట్లున్న సూపర్ స్టార్లు వేల వేల కోట్లు నష్టపోయిన చెన్నైకి ఐదు, పది లక్షలు బిచ్చమెయ్యడం ఏమిటని విమర్శించారు.

ఇవ్వకపోవడం బెటర్

అయ్య బాబోయ్ సూపర్ స్టార్లు 10 లక్షలు, 5 లక్షలు ఇస్తే అంత డబ్బు ఏమి చేయాలో తెలియక చెన్నై ప్రజలు మూర్చపోతారు. ఇవ్వక పోవడం బెటర్.

నేను స్వార్థ పరుడిని

నా విషయానికొస్తే నేను ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా దానం చేయలేదు. నేను స్వార్థ పరుడిని. ఆ సెలబ్రిటీల మీదిరి టన్నుల కొద్ది ప్రేమ కురిపించడం, ప్రార్థనలు చేయడం నాకు చేతకాదు.

అవి ఫ్రీ...

సెలబ్రిటీలు ప్రేమ, ప్రార్థనలు టన్నుల కొద్దీ కురిపిస్తున్నారు. డబ్బుల విషయానికొస్తే మాత్రం కొన్ని మాత్రం ఇస్తున్నారు. ఎందకంటే ప్రేమ, ప్రార్థలు ఉచితం కాబట్టి టన్నుల కొద్దీ ఇస్తున్నారు.

దేవుడిని విమర్శించండి

వర్షాలు కురిసేది దేవుడివల్లే కాబట్టి.. ప్రతిఒక్కరూ ప్రార్థించడానికి బదులు దేవుడిని విమర్శించాలి. లేకపోతే చెన్నైవాసులందరూ పాపులని, అందుకే దేవుడు శిక్షించాడని చెప్పాలి.

మిమ్మిల్ని మీరు నమ్ముకోండి

ఇకనైనా ప్రజలు వెన్నుపోటుదారుడైన దేవుడిని నమ్మి సమయం వృథా చేసుకోడానికి బదులు తమ మీద తాము నమ్మకం పెట్టుకోవాలన్నారు.

English summary
"Since rain is act of God instead of praying shouldn't every1 b condemning God,unless they blve all Chennaities r sinners n God is punishing" RGV tweeted.
Please Wait while comments are loading...