ఇది తెలుసుకోవయ్యా!... మహేష్ బాబుకు హితబోధ చేసిన వర్మ

By Bojja Kumar

హైదరాబాద్: రాజకీయాలు, సినిమా రంగంలో జరిగే విషయాలపై ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే వర్మ... ఈ మధ్య స్టార్ హీరోల సినిమాలు విడుదలైనపుడు తనదైన కామెంట్లతో ట్విట్టర్లో వేడి పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల పవన్ కళ్యాణ్ 'సర్దార్ గబ్బర్ సింగ్' సమయంలో వర్మ క్రియేట్ చేసిన ట్వీటు దుమారం గురించి ఫ్యాన్స్ ఎవరూ మరిచిపోలేదు.

తాజాగా మహేష్ బాబు 'బ్రహ్మోత్సవం' రిలీజైన నేపథ్యంలో వర్మ మరోసారి తన ట్విట్టర్లో కామెంట్స్ చేసారు. బ్రహ్మోత్సవం సినిమా పేరు ఎత్తకుండా మహేష్ బాబుకు హిత బోధ చేసాడు. మహేష్ బాబును కూడా పేరుతో పిలవకుండా మిస్టర్.ఎం అంటూ సంబోధింస్తూ క్లాస్ పీకాడు.

తన మొదటి ట్వీట్లో...'బ్రహ్మోత్సవం' సినిమాలో మహేష్ బాబు డాన్స్ చేస్తున్న చిన్న క్లిప్ పోస్టు చేసిన వర్మ... ఈ డాన్స్ చూసి ప్రపంచ ప్రఖ్యాత కొరియోగ్రాఫర్స్ సేవియన్ గ్లోవర్, మార్తా గ్రాహం, జార్జ్ లాంటి వారు చాలా నేర్చుకోవాలంటూ సెటైర్ వేసారు.

ఫ్యామిలీ సినిమా అంటే తండ్రి హీరోయిన్ అందాలు చూస్తాడు, తల్లి వారు వేసుకున్న దుస్తులు చూస్తుంది. కూతురు తన బాయ్ ఫ్రెండుతో టెక్ట్స్ చేస్తుంది. కొడుకు బోర్ గా ఫీల్ అయి నిద్రపోతాడు. ఎం... దీన్ని అర్థం చేసుకోవాలి అంటూ కామెంట్ చేసారు.

ఫ్యామిలీ సినిమా అంటే కేవలం థియేటర్ వద్ద ఎంట్రీ, ఎగ్జిట్ విజువల్స్. వారు సీట్లో కూర్చున్న తర్వాత పోకిరి, ఒక్కడు, బిజినెస్ మేన్ లాంటివి చూడాలనుకుంటారు. ఈవిషయం మిస్టర్.ఎం తెలుసుకోవాలి అంటూ క్లాస్ పీకారు.

సోకాల్డ్ సూపర్ హిట్ ఫ్యామిలీ ఫిల్మ్స్ శోభన్ బాబు లాంటి వారు మాత్రమే క్రియేట్ చేస్తారు. క్రిష్ణ, ఎన్టీఆర్ లాంటి వారు కాదు. దేవత చిత్రం సూపర్ స్టోరీ నాకు ఇప్పటికీ గుర్తుంది. కానీ శోహన్ బాబు గుర్తు లేడు. ఏజెంట్ గోపి, అడవి రాముడు సినిమాలతో నాకు క్రిష్ణ, ఎన్టీఆర్ గుర్తున్నారు... కానీ ఆ సినిమా స్టోరీ గుర్తు లేదు. మిస్టర్ ఎం నీ యొక్క సూపర్ స్టార్ డమ్ గురించి నువ్వు తెలుసుకోవాలి. ఇలాంటి ఆర్డినరీ ఫ్యామిలీ సినిమాల కంటే చాలా సార్లు వేరే సినిమాలే బాగా ఆడాయి అంటూ వర్మ మహేష్ బాబుకు హితబోధ చేసాడు.

సాధారణంగా వర్మ స్టార్ హీరోలపై ఇలాంటి కామెంట్స్ చేసినపుడు వారి అభిమానుల నుండి ఎదురుదాడి మొదలవుతుంది. వర్మ నిన్న చేసిన ఈ కామెంట్లకు మహేష్ బాబు అభిమానుల నుండి ఎలాంటి ఎదురుదాడి జరుగలేదు. దీంతో ఈ రోజు ఉదయం... వర్మ మళ్లీ ట్వీట్ చేస్తూ...'మిస్టర్ ఎం అభిమానులు నా కామెంట్స్ ను పాజిటివ్ గా తీసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది' అంటూ ట్వీట్ చేసారు.

స్లైడ్ షోలో మహేష్ బాబు ట్వీట్....

ఫ్యామిలీ సినిమా అంటే


ఫ్యామిలీ సినిమా అంటే తండ్రి హీరోయిన్ అందాలు చూస్తాడు, తల్లి వారు వేసుకున్న దుస్తులు చూస్తుంది. కూతురు తన బాయ్ ఫ్రెండుతో మొబైల్ లో చాటింగ్ చేస్తుంది. కొడుకు బోర్ గా ఫీల్ అయి నిద్రపోతాడు. ఎం... దీన్ని అర్థం చేసుకోవాలి అంటూ కామెంట్ చేసారు.

అవే చూడాలనుకుంటారు


ఫ్యామిలీ సినిమా అంటే కేవలం థియేటర్ వద్ద ఎంట్రీ, ఎగ్జిట్ విజువల్స్. వారు సీట్లో కూర్చున్న తర్వాత పోకిరి, ఒక్కడు, బిజినెస్ మేన్ లాంటివి చూడాలనుకుంటారు. ఈవిషయం మిస్టర్.ఎం తెలుసుకోవాలి అంటూ క్లాస్ పీకారు.

తెలుసుకోవాలి


సోకాల్డ్ సూపర్ హిట్ ఫ్యామిలీ ఫిల్మ్స్ శోభన్ బాబు లాంటి వారు మాత్రమే క్రియేట్ చేస్తారు. క్రిష్ణ, ఎన్టీఆర్ లాంటి వారు కాదు అంటూ...

గుర్తులేదు

దేవత చిత్రం సూపర్ స్టోరీ నాకు ఇప్పటికీ గుర్తుంది. కానీ శోహన్ బాబు గుర్తు లేడు. ఏజెంట్ గోపి, అడవి రాముడు సినిమాలతో నాకు క్రిష్ణ, ఎన్టీఆర్ గుర్తున్నారు... కానీ ఆ సినిమా స్టోరీ గుర్తు లేదు.

స్టార్ డమ్ గురించి..


మిస్టర్ ఎం నీ యొక్క సూపర్ స్టార్ డమ్ గురించి నువ్వు తెలుసుకోవాలి. ఇలాంటి ఆర్డినరీ ఫ్యామిలీ సినిమాల కంటే చాలా సార్లు వేరే సినిమాలే బాగా ఆడాయి అంటూ వర్మ మహేష్ బాబుకు హితబోధ చేసాడు.

మహేష్ బాబు డాన్స్


బ్రహ్మోత్సవంలో మహేష్ బాబు డాన్స్ గురించి సెటైర్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X