»   » పవన్ ని మళ్లీ వీర లెవిల్ లో కెలుకుతూ..

పవన్ ని మళ్లీ వీర లెవిల్ లో కెలుకుతూ..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి ట్వీట్స్ చేయటం అంటే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కు మహా సరదా లాగ ఉంది. గతంలో పలు మార్లు పవన్ ని ఆయన ఫ్యాన్స్ ని ఉద్దేశిస్తూ ట్వీట్స్ చేసిన ఆయన ఈ సారి మరోమారు ట్వీట్ బాణం పవన్ పైకి ఎక్కి పెట్టారు. అంతేకాదు..అందులో పవన్ తీరుని తప్పు పట్టారు.

పవన్ ట్వీట్స్ కు నేపధ్యం.. గత ఆదివారం తూర్పుగోదావరి జిల్లా తునిలో చోటు చేసున్న సంఘటనలు. కాపులను బీసీల్లో చేర్చాలంటూ జరుగుతున్న ఆందోళనలపై పవన్‌ ప్రెస్‌మీట్‌ పెట్టారు. పవన్‌ ప్రెస్‌మీట్‌ను తాను ఇప్పుడే విన్నట్లుగా పేర్కొన్న వర్మ ఈ క్రింద విధంగా ట్విట్టర్‌లో కొన్ని ట్వీట్స్‌ చేశారు.

స్లైడ్ షోలో ఆ ట్వీట్స్ చూడండి...

అర్దమయ్యాయా

మీడియా సమావేశంలో మాట్లాడిన పవన్‌ మాటలు ఆయనకైనా అర్థమయ్యాయా? అని ప్రశ్నించిన వర్మ.. ప్రెస్‌మీట్‌కు వచ్చే సమయంలో కారులో తన పక్కనున్న వ్యక్తి చెప్పిన మాటలతో తీవ్ర ప్రభావానికి లోనై మాట్లాడినట్లుగా పవన్‌ మాటలు ఉన్నాయని వర్మ వ్యాఖ్యానించారు.

సరిచూసుకో

ప్రెస్‌మీట్‌ సందర్భంగా పవన్‌ తాను చేసిన ప్రసంగాన్ని మరోసారి చూసుకోవాలని.. ఇది ఆంధ్రప్రదేశ్‌ పౌరుడిగా.. పవన్‌కల్యాణ్‌ అభిమానిగా తాను విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

నమ్మక ద్రోహి

పీకే అభిమానిగా తాను వ్యక్తపరిచిన నిజాలను వ్యతిరేకించే ఏ పవన్‌ కల్యాణ్‌ అభిమాని అయినా తన దృష్టిలో నమ్మకద్రోహిగా వర్మ పేర్కొనటం గమనార్హం.

ప్రారంభ ప్రసంగం

జనసేన పార్టీ ప్రారంభించిన సమయంలో పవన్‌ చేసిన ప్రసంగాన్ని ఆయన మరోసారి చూసుకోవాలని వర్మ సూచించారు.

రిక్వెస్ట్

పవన్‌ సోదరుడు చిరంజీవి రాజకీయ వైఫల్యం కంటే పవన్‌ కల్యాణే ఎక్కువగా విఫలమైనట్లు పేర్కొంటూ...పికే అభిమానలందరికీ నా రిక్వెస్ట్ ఏమిటీ అంటే...నేను ఎలా అయితే నిజాయితీగా చెప్తున్నానో మీరూ మీకు తెలిసిన నిజాలని అతనికి చెప్పండి

చిరంజీవిలో పవన్ ...

నిజం ఏమిటీ అంటే...కాపుల్లో...కమ్మవారు, అలాగే కమ్మ వారిలో కాపులు ఎలాగైతే ఉన్నారో..చిరంజీవిలో కళ్యాణ్...కళ్యాణ్ లోచిరంజీవి ఉన్నారు అని చెప్పుకొచ్చారు.తునిలో కాపులను బీసీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ కాపు ఐక్యవేదిక మహా గర్జన ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ గర్జన ఉద్రిక్తంగా మారి రత్నాచల్ ఎక్సప్రెస్ నే తగలబెట్టే దాకా వెళ్లింది.

English summary
RGV Tweeted: Truth is,there are kammas in kaapus nd there are kaapus in kammas just like there's kalyan in Chiranjeevi nd there's Chiranjeevi in Kalyan. My request to all PK fans is that since u all know in ur heart what the truth is u should tell him with as much honesty as how I am telling
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu