నరేంద్ర మోడీ పాలనపై వర్మ కామెంట్

By Srikanya

RGV unhappy with Narendra Modi
హైదరాబాద్: మన ప్రధాని నరేంద్ర మోడీ పాలనపై వర్మ కామెంట్ చేసారు. "మోడీ చెప్పిన ఇంటర్వెల్ డైలాగు... అచ్చా దిన్ ఆయేగా అనేది చాలా ఇష్టపడ్డాను...కాని ఎందుకు సెకండాఫ్ ఇంకా ప్రారంభం కావటం లేదో అర్దం కావటం లేదు...చాలా ఇరిటేషన్ గా ఉంది... అంటూ ఆయన ట్వీట్ చేసారు. అయితే ఆ వెంటనే నా ట్విట్టర్ ఎక్కౌంట్ హ్యాక్ అయ్యింది అంటూ కామెంట్ చేసారు. దాంతో ఇది ఆయన స్వంతగా చేసిందో లేక హాకర్ చేసిన కామెంటో చాలా మందికి అర్దం కాలేదు. ఇక సినిమాల విషయానికి వస్తే రీసెంట్ గా విడుదలైన ఐస్ క్రీమ్ చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అయితే వెంటనే అదే నిర్మాతతో ఆయన మరో చిత్రం మొదలెట్టారు.

నేను సినీ దర్శకత్వం మొదలు పెట్టినప్పట్నుంచీ అన్నీ జోనర్లకు చెందిన సినిమాలు తీసాను. ఉదాహరణకు విద్యార్థి రాజకీయాలు (శివ), ప్రేమకథ (రంగీలా), హారర్‌ (భూత్‌), గ్యాంగ్‌స్టర్‌ (సత్య), డ్రామా (సర్కార్‌), సైకలాజికల్‌ థ్రిల్లర్‌ (కౌన్‌), తీవ్రవాదం (26/11) తరహా సినిమాలు చేసేశాను. ఇక మిగిలింది శృంగార చిత్రమే. ఈ లోటును 'కోరిక' ద్వారా పూర్తి చేసుకుంటాను.నాకు తెలిసి సంకల్ప బలం, శారీరక వాంఛ అనేవి మనిషి జీవితాన్ని ప్రభావితం చేసే ముఖ్యాంశాలు. 'కోరిక‌'చిత్రంలో దీన్నే చూపిస్తున్నాను అన్నారు.

నా ఉద్దేశ్యంలో పవన్, సెక్సువల్ ప్లెజర్ అనేవి మనుషుల్లో ఉండే అత్యంత బలమైన ప్రాధమిక ప్రేరేపణలు. విభిన్న సందర్బాల్లో వేరు వేరు మనస్తత్వాలు గల వాళ్లు ...వాళ్లలో కలిగిన శారీరక కోరికలకు సంభందించిన స్పందనల మూలన ఏం చేసారో..వాటి వలన ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నయో వంటి విషయాలను స్టడీ చేసి...ఈ కథను సిద్దం చేసుకున్నాను అని చెప్పారు.

ఇక ఆయన ఈ చిత్రాన్ని 'ఎక్సెస్‌'(XES)టైటిల్ తో హిందీలో చేస్తున్నారు. దాని గురించి మాట్లాడుతూ... ''నాకు సౌకర్యంగా ఉండే అన్ని రకాల (జోనర్స్‌) సినిమాలు తీసేశాను. ఒక్క శృంగార చిత్రం తప్ప. ఇప్పుడు ఆ సినిమా కూడా చేస్తున్నాను'' అంటూ సంచలన ప్రకటన చేశాడు రామ్‌గోపాల్‌వర్మ. హిందీలో రూపొందబోతున్న ఈ చిత్రానికి 'ఎక్సెస్‌'(XES) అనే పేరు ఖరారు చేసి, పోస్టర్‌ను ఆన్‌లైన్‌లో విడుదల చేశాడు.

వర్మ చెబుతూ ''విద్యార్థి రాజకీయాలు (శివ), ప్రేమకథ (రంగీలా), హారర్‌ (భూత్‌), గ్యాంగ్‌స్టర్‌ (సత్య), డ్రామా (సర్కార్‌), సైకలాజికల్‌ థ్రిల్లర్‌ (కౌన్‌), తీవ్రవాదం (26/11) తరహా సినిమాలు చేసేశాను. ఇక మిగిలింది శృంగార చిత్రమే. ఈ లోటును 'ఎక్స్‌ఎస్‌' ద్వారా పూర్తి చేసుకుంటాను.నాకు తెలిసి సంకల్ప బలం, శారీరక వాంఛ అనేవి మనిషి జీవితాన్ని ప్రభావితం చేసే ముఖ్యాంశాలు. 'ఎక్సెస్‌'చిత్రంలో దీన్నే చూపిస్తున్నాను. ఆరు భిన్న పాత్రలకు సంబంధించి శృంగార సన్నివేశాలు, దాని వెనుక ఉన్న కారణాలు సినిమాలో ఉంటాయి'' అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X