వర్మ 'వెన్నుపోటు' భీభత్సం.. దెయ్యాలన్నీ కలసి దేవుడులాంటి ఎన్టీఆర్‌ని!
Recommended Video

తిమ్మిని బమ్మి చేయగల సమర్ధుడు రాంగోపాల్ వర్మ. తన వితండ వాదంతో ఎలాంటి విషయాన్ని అయిన తనకు అనుకూలంగా మరోచుకోగలడు. మరో మారు వర్మ అలాంటి ప్రయత్నాల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఓ వైపు బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ తో సంచలనం సృష్టించే ప్రయత్నం చేస్తుంటే మరోవైపు వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని తెరమీదికి తీసుకుని వచ్చాడు. దీనితో సోషల్ మీడియా మొత్తం మోతెక్కిపోతోంది. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో నిజాలు చూపించడం లేదని కాబట్టి తాను లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని చేస్తున్నానని వర్మ చెబుతున్నాడు.

వెన్నుపోటు భీభత్సం
లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి ప్రచారం కోసం వర్మ ప్రస్తుతం వెన్నుపోటు అనే పదాన్ని బాగా ఉపయోగించుకుంటున్నాడు. వెన్నుపోటుపై లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో ఓ పాట కూడా ఉందని ఆపాటని నిన్ననే వర్మ విడుదల చేశాడు. వెన్ను పోటు అనగానే ఎన్టీఆర్ రాజకీయ విషయంలో జరిగిన కొన్ని పరిణామాలు గుర్తుకు వస్తాయి. తెలుగు రాజకీయాల్లో ఆ సంఘటనలు అంత్యత సంచలనం రేపాయి.

తొలిగంటలోనే
వర్మ వెన్నుపోటు పాటని సోషల్ మీడియాలో ఇలా విడుదుల చేసాడో లేదో క్షణాల్లో వైరల్ అయిపోయింది. ఈ పాట యూట్యూబ్ లో 6 వస్థానంలో ట్రెండ్ అవుతోంది. 9 లక్షలకు పైగా వ్యూస్ సొంతం చేసుకుని మిలియన్ వైపు పరుగులు తీస్తోంది. 44వేలకు పైగా లీక్స్ వచ్చాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ పాట సోషల్ మీడియాలో భీభత్సం సృష్టిస్తోంది.
దెయ్యాలన్నీ కలసి
దెయ్యాలన్నీ కలసి దేవుడులాంటి ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచారని వర్మ ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించాడు. వర్మ వ్యాఖ్యలు, వెన్నుపోటు సాంగ్ కు వ్యతిరేకంగా కొందరు టిడిపి కార్యకర్తలు అతడి ఫోటోలని తగలబెడుతూ ఆందోళన నిర్వహిస్తున్నారు. వాళ్ళు నిరసన తెలపట్లేదు. ఎంజాయ్ చేస్తున్నారు. నేను కూడా పార్టీలో జాయిన్ కానా అంటూ వర్మ ట్వీట్ చేయడం విశేషం.

లక్ష్మీస్ ఎన్టీఆర్ కోసమే
వర్మ సోషల్ మీడియాలో ఏ చిత్రం కోసం మీరు ఎక్కువగా ఎదురుచూస్తున్నారు అని పోల్ నిర్వహించగా తన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికే అత్యధిక ఓట్లు పడ్డాయని 62 శాతం మంది లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్నే కోరుకుంటున్నారని రాంగోపాల్ వర్మ తెలిపాడు. మొత్తంగా వర్మ ఒక అంశాన్ని కెలికాడంటే సోషల్ మీడియాలో తెగ హంగామా మొదలవుతుంది. వర్మ వెన్నుపోటు ఫార్ములా బాగానే వర్కౌట్ అయినట్లు ఉంది.


Click it and Unblock the Notifications











