For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ఎన్టీఆర్‌కు జరిగిన అన్యాయం గురించి...రామ్ గోపాల్ వర్మ సంచలన వీడియో!

  |
  NTR Talks About How CBN Backstabbed Him - Sr NTR About Chandrababu Naidu

  వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ సంచలన వీడియోను తన యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేశారు. ఎన్టీ రామారావు తన వాళ్ల చేతుల్లో, ముఖ్యంగా అల్లుడి కారణం వెన్నుపోటుకు ఎలా గురయ్యారు అని స్వయంగా రామారావు తన వాయిస్‌తో చెబుతున్నట్లు అందులో ఉంది. ఈ వీడియో ద్వారా తన తాజా చిత్రం 'లక్ష్మీస్ ఎన్టీఆర్'కు పరోక్షంగా ప్రచారం కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. మార్చి 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

  ''మీకు తెలుసు.. ప్రజలే నా దేవుళ్లు.. ప్రజా క్షేమమే నా ఊపిరి అని, బడుగు ప్రజల అభ్యున్నతి కోసమే ఈ జీవితం అంకితం అని, ధర్మం చేయాల్సింది మీరు కాబట్టి నాకు జరిగిన అన్యాయం గురించి మీ ప్రజా న్యాయస్థానం ముందు ఉంచుతున్నా. నీతికి అవినీతికి జరుగుతున్న ఈ సమరంలో తుది నిర్ణేతలు మీరే.'' అంటూ ఎన్టీ రామారావు చెబుతున్నట్లు బ్యాగ్రౌండ్ వాయిస్‌తో ఈ వీడియో ఉంది.

  కారణం నా అల్లుడే

  కారణం నా అల్లుడే

  ఇప్పుడు ఈ గూడు పుటానికి, మోసానికి మూలస్తంభం, పద్మ వ్యూహానికి కేంద్ర బింధువు నా అల్లుడు. నా గుండెల్లో చిచ్చు పెట్టినవాడు. మీ అందరికీ తెలుసు.. నా పార్టీ ఆవిర్భవించడానికి ముందు అతడు ఏమిటో. నా ప్రత్యర్థి పార్టీలో ఉండి నా పార్టీని ఎదురించి, నా తోనే పోటీ చేస్తానని ప్రగల్బాలు పలికి.. నా పార్టీ మహా ప్రభంజనంలో కొట్టుకుపోయిన ఒక చిన్న మిడత.

  ఒక దుష్ట ఆలోచనతో నా పార్టీలో చేరాడన్న మర్మాన్ని కనిపెట్టలేక పోయా

  ఒక దుష్ట ఆలోచనతో నా పార్టీలో చేరాడన్న మర్మాన్ని కనిపెట్టలేక పోయా

  నా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలోకి చేరతానంటే అతడిని చేర్చుకోవద్దని చాలా మంది హితవు చెప్పారు. అయినప్పటికీ పశ్చాత్తాపాన్ని ప్రకటించాడు కదా అని ఔదార్యంతో పార్టీలో చేర్చుకుని ముఖ్యమైన పదవి ఇచ్చాను. అయితే అతడు ప్రజాసేవ కోసం కాకుండా ఒక దుష్ట ఆలోచనతో నా పార్టీలో చేరాడన్న మర్మాన్ని కనిపెట్టలేక పోయాను. ప్రజా సంక్షేమం ప్రజా సమస్యలు తప్ప మరేమీ మనసులో పెట్టుకోని నేను అతడు పెంచి పోషిస్తున్న ముఠాలు, చేరదీస్తున్న గ్రూపులు వీటి గురించి నేను పట్టించుకోలేదు.

  వర్మ కొత్త లెక్కలు.. 2+2 +1+1+1+2 = 9.. అంకెల గారడీ వెనుక అసలు కథ ఏంటంటే!

  వెన్నుపోటు నాకు కాదు మీకు

  వెన్నుపోటు నాకు కాదు మీకు

  అసలు అతడిలో దురాశ ఇంతగా ఉంటుందని నేను ఊహించలేక పోయాను. అతడి వల్లే ప్రజాస్వామ్యం పట్టపగలు ఇంత దారుణంగా హత్యకు గురవుతుందని, అధికారం కోసం నా మనిషి అతి అల్పమైన, నీచమైన, అతి హేయమైన వెన్నుపోటుకు సిద్దపడతాడని ఊహించలేక పోయాను. అతడు మేకవన్నె పులి, తేనె పూసిన కత్తి, ఆ కత్తితో వెన్ను పోటు జరిగింది నాకు కాదు.. నన్ను నమ్మి నాకు అధికారం ఇచ్చిన మీకు. మీరు వేసిన ఓటుకు, ప్రజాస్వామ్యాని, విశ్వసించిన నా ఆశయాలకు వెన్నుపోటు.

  దేవుడు కూడా క్షమించనటువంటి ఘాతుకం

  దేవుడు కూడా క్షమించనటువంటి ఘాతుకం

  ఇంతటి నీచానికి ఒడిగట్టినవాడు చేతులు జోడించి, నమస్కారం చేసి తుపాకి పేల్చి మహాత్ముని పొట్టన పెట్టుకున్న గాడ్సే కన్న అధముడు. నాకు ఏ విధంగా ద్రోహం చేయబడింది నా వాళ్లు.. నా పిల్లలు, నా కుటుంబీకులు వాడి పంచన చేరిన కొంత మంది పార్టీ వాళ్లు నన్న ఏ విధంగా మోసం చేశారు అన్నది ప్రజలకు చెప్పడం నా ధర్మం. నా కర్తవ్యం. నా బాధ్యత. దేవుడు కూడా క్షమించనటువంటి ఘాతుకం చేశాడు.

  వారికే ఓటు వేయండి

  ఏ విధమైన రాజకీయం కావాలి, ఏ విధమైన ప్రజస్వామ్యం ఉండాలి అనేది నిర్ణయించాల్సింది మీరు. మీ నిర్ణయమే శిరోధార్యం, అదే ప్రజాస్వామ్యం. కాబట్టి మీరు ఏ పార్టీ అయితే ప్రజాస్వామ్యాన్ని ఉద్దరిస్తుందో, ఏ పార్టీ అయితే మనం తెచ్చుకున్న స్వాతంత్రానికి ఒక చక్కటి రూపం దిద్దగలుగుతుందో అటువంటి పార్టీకి మీరు ఓటు వేయండి. అంతే కానీ దుర్మార్గులకు, మసగాళ్లకు, వెన్నుపోటు దారులకు ఓటు వేయకండి.

  English summary
  NTR talks about how CBN backstabbed him. Watch #NTRSandesam, Sr NTR emotional about backstabber Chandrababu Naidu. RGV's latest movie Lakshmi's NTR based on CBN backstabbing NTR is all set for a grand release on March 22nd, 2019.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more