Don't Miss!
- News పట్టు కోల్పోయిన పవన్: వైసీపీలో మరో జనసేన సీనియర్
- Finance Zomato: జొమాటోకు షాక్.. రూ. 11.81 కోట్ల పెనాల్టీ..!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Automobiles కొత్త మారుతి స్విఫ్ట్ బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా? ఇక్కడ చూడండి!
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
షాకులే షాకులు: జీవితంలో తొలిసారి ఎవరూ ఊహించని పని చేసిన వర్మ!
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనను తాను నాస్తికుడిని అని చెప్పుకుంటారు. అంతే కాదు గతంలో పలు సందర్భాల్లో దేవుళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కారు. ఆయనపై కొన్ని మత సంఘాలు కేసులు కూడా పెట్టాయి.
అతాంటి రామ్ గోపాల్ వర్మ జీవితంలో తొలిసారి గుడికి వచ్చి పూజలు చేశారు. బంధువులతో కలిసి ఆయన చిత్తూరు జిల్లా కాణిపాకం వినాయకుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు వర్మకు వినాయకుడి చిత్రపటం, ప్రసాదం అందజేశారు. సాధారణ భక్తుల తరహాలోనే వర్మ దైవదర్శనం చేసుకున్నారు. అంతే కాదు తిరుమల వెంకన్నను దర్శించుకోబోతున్నట్లు తెలిపారు.
జీవితంలో తొలిసారి అంటూ...
వర్మ తన ఫేస్ బుక్ పేజీలో గురువారం ఓ పోస్టు చేశారు. ‘‘నాస్తికుడినైన నేను నా జీవితంలో మొట్టమొదటి సారిగా అక్టోబర్ 19 పొద్దున్న 6 గంటలకి తిరుపతి లో బాలాజీ వేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని సాయంత్రం 4 గంటలకి తిరుపతి శిల్పారామం లో ప్రెస్ మీట్ పెట్టి లక్ష్మి'స్ ఎన్టీఆర్ వివరాలు చెప్పబోతున్నాను'' అని తెలిపారు.
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా గురించి
అయితే రామ్ గోపాల్ వర్మ తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టి లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా గురించిన వివరాలు ప్రకటిస్తాను అనగానే అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ ప్రెస్ మీట్ ద్వారా వర్మ ఎలాంటి సంచలనాలు బయటపెట్టబోతున్నాడో అని ఎదురు చూస్తున్నారు.
చంద్రబాబు లాంటి వ్యక్తిని కనిపెట్టిన వర్మ
లక్ష్మీ పార్వతి కోణంలో ఎన్టీఆర్ గురించి చూపించే చిత్రమే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్'. ఈ చిత్రంలో ఎన్టీఆర్ జీవితంలోని ముఖ్య వ్యక్తులను చూపించబోతున్నారు. అందులో అతిముఖ్యమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇటీవలే అచ్చం చంద్రబాబును పోలిన వ్యక్తిని సైతం వర్మ కనిపెట్టి తన సినిమా కోసం తీసుకున్నాడు.
ఎన్టీఆర్ జీవితంలోని వివాదాలుంటాయా?
లక్ష్మి పార్వతి కోణంలో ఎన్టీఆర్ జీవితాన్ని చూపించబోతున్నా కాబట్టి ఈ చిత్రంలో పలు వివాదాస్పద అంశాలు ఉంటాయని భావిస్తున్నారు. ఎన్టీఆర్ పాత్ర కోసం ఇప్పటికే ముగ్గురిని షార్ట్ లిస్ట్ చేసిన వర్మ ఇంకా బెటర్ లుక్స్‌తో ఉండేవారి కోసం అన్వేషిస్తున్నారు.