మహిళపై ట్వీట్: రామ్ గోపాల్ వర్మ మళ్లీ రెచ్చిపోయాడు!
హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తన నైజం ప్రదర్శించాడు. కావాలని వివాదాలు సృష్టించడం, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, తద్వారా పబ్లిసిటీ పెంచుకోవడం అలవాటు చేసుకున్న వర్మ ట్విట్టర్ వేదికగా తన ఇష్టం వచ్చినట్లు కామెంట్ చేసారు.
ఈ సారి ఆయన వ్యాఖ్యలు మహిళలను ఉద్దేశించి చేయడం గమనార్హం. ‘యాపిల్ కంపెనీ ఫోన్లు, వాచీలు, కార్లు తయారుచేస్తోందని.. అంతా బాగానే ఉంది.. అదే విధంగా యాపిల్ మహిళలను కూడా తయారు చేయాలని సిన్సియర్ గా కోరుకుంటున్నాను' అంటూ వివాదాస్పద ట్వీట్ చేసారు.

మరో వైపు నాస్తికుడైన వర్మ....ఈసారి లక్ష్మిదేవిని ఉద్దేశించి ట్వీట్టు వదిలారు. ‘అసలు లక్ష్మీదేవిని పూజించని అమెరికాలో మనకంటే ఎక్కువ డబ్బుంటే...అది లక్ష్మీదేవి లోపమా.. లేక ఆమెను పూజించే మన మూర్ఖత్వమా' అంటూ ట్వీట్ చేసారు. వర్మ ట్వీట్లపై ఎలాంటి దుమారం రేగుతుందో?


Click it and Unblock the Notifications











