'నా ఇష్టం' తో అందరికీ షాక్ ఇవ్వలనున్న రామ్ గోపాల్ వర్మ
రామ్ గోపాల్ వర్మ త్వరలో "నా ఇష్టం" అనే టైటిల్ తో ఓ పుస్తకం విడుదల చేయబోతున్నారు. ఆయన తన బయోగ్రఫిగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారని చెప్తున్నారు. అయితే ఆయన రాసిన ఆర్టికల్స్ సమాహారం ఇది అని తెలుస్తోంది. ఈ పుస్తకాన్ని ఎమొస్కో వారు పబ్లిష్ చేస్తున్నారు. అలాగే ఈ పుస్తకాన్ని అంకితం చేసేది మరెవరికో కాదట..ఆయనకేట. ఈ పుస్తకం మొదట్లో...అంకితం-నాకే అని ఉంటుంది. ఈ విషయం అంతటా ఆసక్తి రేపుతోంది. ప్రతీ విషయంలోనూ వివాదం చేసి ఆసక్తి రేపే వర్మ ఈ సారి కూడా తనదైన మార్కెటింగ్ స్టాటజీని వినియోగిస్తున్నాడంటున్నారు. ఈ నాఇష్టం పుస్తకాన్ని ఆయన సినిమా రేంజిలో ప్రమోట్ చేయనున్నారని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ...సునీల్ తో చేస్తున్న అప్పలరాజు చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అలాగే తన తదుపరి చిత్రం త్రీడి..అమ్మకు స్క్రిప్టు రెడీ చేస్తున్నారు. వీటితో పాటు బెజవాడ రౌడీలకు కూడా వర్క్ జరుగుతున్నట్లు చెప్తున్నారు. అలాగే రక్త చరిత్ర పార్ట్ 2 డిసెంబర్ మొదటి వారంలో విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











