'రాజకీయం' చేయటానికి ఫిక్సయ్యానంటున్న రామ్ గోపాల్ వర్మ
బయట జరుగుతున్న రాజకీయ పరిస్ధితులని చూస్తుంటే తనకు "రాజకీయం" అనే టైటిల్ తో ఓ చిత్రం చేయాలని తీవ్రమైన కోరిక పుడుతోందని వర్మ అంటున్నారు. "రాజకీయం" కథ రాజకీయ మెకానిజం గురించి, రాజకీయ సైకాలజీల గురించి చర్చిస్తుందని చెప్పారు. అలాగే రాజకీయం గురించి వింటూంటే వెనక ఏం జరుగుతోంది, ముందుకు ఏం కనపడుతోందని అనేది చూస్తే అండర్ వరల్డ్ పాలిటిక్స్ ఎక్కువగా ఉన్నాయని, అలాగే పాలిటిక్స్ లో అండల్ వరల్డ్ వాతావరణం ఎక్కువగా ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. ఇక తను చేసిన కంపెనీ చిత్రం అండర్ వరల్డ్ పాలిటిక్స్ ని చూపితే, సర్కార్ ..ఫ్యామిలీ పాలిటిక్స్ ని చర్చిందని, ఇప్పుడు పొలిటికల్ పాలిటిక్స్ ని చూపాలని నిర్ణయించుకున్నానని అన్నారు. ప్రస్తుతం వర్మ సునీల్ హీరోగా కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం..అప్పలరాజు అనే చిత్రం డైరక్ట్ చేస్తున్నారు. సంక్రాంతికి ఈ చిత్రం రిలీజ్ అవుతుంది. అలాగే ఆయన తాజా చిత్రం రక్త చరిత్ర-2 డిసెంబర్ మూడవ తేదీన విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











