'కాఫీ వద్దు వోడ్కానే ముద్దు'...రామ్ గోపాల్ వర్మ
రామ్ గోపాల్ వర్మకీ మరో దర్శకుడు కరణ్ జోహార్ కి మధ్య చాలా కాలంగా కామెంట్స్ యుధ్దం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా వర్మని తన కాఫీ విత్ కరణ్ పోగ్రాంకి పిలుస్తానని, ఆ షోకు రేటింగ్స్ ఎలా ఉంటాయో తెలియకపోయినా, ఇద్దురు ఫన్ గా మాట్లాడే వారు షోలో వ్యగ్యంగా మాట్లాడుకోవటం బావుంటుందంటూ కరణ్ వ్యాఖ్యానించారు. దానికి స్పందనగా వర్మ తన ట్విట్టర్ లో కరన్ తో కాఫీ కాదు వోడ్కా తాగటం నా కల అని ట్వీట్ చేసారు. అంటే వర్మ..ఆ పోగ్రామ్ కి వెళ్ళనని మరింత వ్యగ్యంగా చెప్పారన్నమాట. ఇక ఈ పోగ్రాం స్టార్ నెట్ వర్క్ లో వస్తున్న అతి పాపులర్ పోగ్రాములలో ఒకటి.
ఇక ఆ మధ్య కరణ్ జోహార్ చిత్రం వుయ్ ఆర్ ఫ్యామిలీ రిలీజై ప్లాప్ టాక్ తెచ్చుకుంది. హాలీవుడ్ చిత్రం స్టెప్ మామ్ అఫీషయల్ రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం గురించి వర్మ ట్వీట్ చేస్తూ..అఫీషయల్ గా రీమేక్ చేయటంలో ఉన్న మంచి విషయం ఏమిటంటే..అఫీయల్ గా మనం ఎంత బ్యాడ్ మేకర్స్ మో ప్రపంచానికి ప్రూవ్ చేయటానికి ఉపయోగపడుతుంది అన్నారు. దానికి కరణ్ కూడా తీవ్రంగానే స్పందించారు. ప్రస్తుతం వర్మ..కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం..అప్పలరాజు పనిలో బిజీగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











