మధు షాలిని పై సీరియస్ అయ్యిన వర్మ
రామ్ గోపాల్ వర్మ డిపార్టమెంట్ చిత్రంలో వేషం సంపాదించిన మధషాలికి రీసెంట్ గా రామ్ గోపాల్ వర్మ వార్నింగ్ ఇచ్చాడని సమాచారం. దానికి కారణం ఆమె ఆ సినిమాలో తన గెపట్ డిఫెరెంట్ గా ఉండటంతో ఓ స్టిల్ ని తీసుకుని తన ట్విట్టర్ ఎకౌంట్ లో పేస్ట్ చేసింది.మీరు చూస్తున్న ఫోటో అదే. దాంతో ఆయన ఆ విషయం తెలుసుకుని చాలా సీరియస్ అయ్యారు. వెంటనే దాన్ని డిలేట్ చేసెంతోయ్యమని చెప్పారు. అంతేకాక తన అనుమతి లేనిదే సినిమా కి చెందిన విషయం గానీ, ఫోటో లు కానీ బయటకు వెళ్లటానికి వీల్లేదని అన్నారు. దాంతో ఆమె సారి చెప్పింది. ఇక ఆమె ఈ చిత్రంలో చాలా ఢిఫెరెంట్ గా కనిపించనుందని తెలుస్తోంది. ఆ విషయాన్ని ఆయన సీక్రెట్ గా ఉంచి ఒక్కసారిగా రివిల్ చేసి ఆశ్చర్యపరిచే ఆలోచనలో ఉన్నారు. అంతేగాక వర్మకు మొదటనుంచి తన ప్రాడెక్టుకి చెందిన ప్రతీ విషయంలోనూ తనకే పూర్తి పబ్లిసిటీ, గుర్తింపు రావాలని వ్యక్తి కావటం కూడా ఈ సీరియస్ నెస్ కు కారణమైంది. ఇక డిపార్టమెంట్ చిత్రంలో రానా, సంజయ్ దత్, అమితాబ్ వంటి స్టార్స్ చెస్తున్నారు. అలాగే లక్ష్మి ప్రసన్న కూడా కీలకపాత్రలో కనిపించనుంది. ఇక మధుశాలిని విషయానికి వస్తే ఆమెను రానా రికమెండ్ చేసాడని తెలుస్తోంది. రానాతో పాటే ఆమె ముంబైలో ఉంటోందని వినికిడి. తెలుగులో ఒక్క ఆఫర్ కూడా రాకపోవటంతో ఈ సినిమాతో అయినా ఆమెకు గుర్తింపు వస్తుందని భావిస్తోంది. అండర్ వరల్డ్-పోలిస్ కథాంశంతో రూపొందుతున్నడిపార్టమెంట్ సినిమాలో...అమితాబ్, సంజయ్ దత్, రాణా దగ్గుబాటిల తో పాటు ఉండే గ్యాంగ్ స్టర్ గా మధుశాలిని నటించబోతోంది. ఈ పాత్ర కోసం ఆడిషన్ నిర్వహిస్తుండగా అనుకోకుండా రానా దృష్టి మధుశాలినిపై మళ్లింది. ఆమె ఆ పాత్రకు సరిగ్గా సరిపోతుందని రామ్ గోపాల్ వర్మకు చెప్పి ఒప్పించాడు. బాలీవుడ్ అవకాశం కావడంతో మధు శాలిని కూడా మారు మాట్లాడకుండా ఓకే చెప్పింది. డిపార్ట్ మెంట్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయ్యింది.


Click it and Unblock the Notifications











